శ్రీవల్లి ఫస్ట్ లుక్.. సుకుమార్ అక్కడి నుండే ప్రేరణ పొందాడట..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఇద్దరు కూడా మాస్ లుక్ లో అదిరి పోయారని చెప్పాలి.

  sukumar Inspiration For Srivalli First Look In Pushpa, Pushpa, Rashmika Mandan-TeluguStop.com

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే అల్లు అర్జున్ లుక్, రష్మిక లుక్ రివీల్ చేసాడు సుకుమార్.

ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.ఈ మధ్యనే విడుదల అయినా రష్మిక లుక్ కు మంచి స్పందనే వస్తుందని చెప్పాలి.ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో మొదటిసారి కనిపించ బోతుంది.ఈ లుక్ లో రష్మిక చీర ధరించి అద్దం ముందు కూర్చుని రెడీ అవుతున్న దృశ్యాన్ని సుకుమార్ వదిలారు.

దీంతో ఈ లుక్ మాస్ ప్రేక్షకులను అలరించింది.

Telugu Allu Arjun, Pushpa, Srivalli, Sukumar, Sukumarsrivalli-Movie

అయితే ఈ లుక్ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది.సుకుమార్ ఈ లుక్ ను ప్రేరణ పొంది ఇలా చేసాడని టాక్.ప్రముఖ చిత్రకారుడు లెజండరీ ఎస్.ఇళయరాజా ఫేమస్ పెయింటింగ్స్ నుండి ప్రేరణ పొంది సుకుమార్ ఈ స్టిల్ ను వదిలాడని టాక్.ఈయన ఏది పెయింటింగ్ చేసిన అది ఛాయాచిత్రం లాగా కనిపిస్తుంది.

ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Telugu Allu Arjun, Pushpa, Srivalli, Sukumar, Sukumarsrivalli-Movie

ఈయన గత సంవత్సరం కరోనా కారణంగా మృతి చెందారు.ఈ దివంగత కళాకారుడి పెయింటింగ్స్ ఒకదాని నుండి ప్రేరణ పొంది ఈ లుక్ ను రివీల్ చేసాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్టుమేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube