చదివిన స్కూల్ కు మంచి చేసిన సుకుమార్.. ఏం చేశారంటే!

ప్రముఖ సిని తెలుగు దర్శకుడు, సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వృత్తి పరంగా ఏ విధమైనటువంటి నిబద్ధత కలిగి ఉంటాడో అతని సినిమాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది.

 Sukumar Has Done Good For The School He Studying Video, Director Sukumar, Good F-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాని తెరకెక్కిస్తున్నారు.సినిమాల పరంగా ఈ స్థాయిలో ఉన్న సుకుమార్ ఇప్పటికి తను పుట్టిన ఊరిని చదివిన స్కూల్ ని మర్చిపోలేదు.

ఈ క్రమంలోనే తమ గ్రామ అభివృద్ధి కోసం,తన గ్రామంలోని పిల్లల కోసం ఏకంగా తన గ్రామంలో పాఠశాలను నిర్మించి తన మంచి మనసు చాటుకున్నారు.

సుకుమార్ తూర్పు గోదావరి జిల్లా మట్టపర్రు గ్రామం తన స్వగ్రామం.

ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది.అయితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాలకు సుకుమార్ సుమారు 20 లక్షల వరకు ఖర్చు చేసి కొత్త భవనాన్ని నిర్మించారు.

ఈ క్రమంలోనే భవన నిర్మాణం పూర్తి కావడంతో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారితో కలిసి సుకుమార్ దంపతులు ఈ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telugu Sukumar, School-Movie

ఈ క్రమంలోనే సుకుమార్ మాట్లాడుతూ.ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ గారు తన వద్దకు ఈ ప్రపోజల్ తీసుకువచ్చారని, పిల్లల కోసం తన గ్రామంలో పాఠశాలను నిర్మించాలని భావించి తన తండ్రి జ్ఞాపకార్థంతో పాఠశాల భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube