సుకుమార్‌ దారిలో హరీష్‌ శంకర్‌

ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా మారి ఇప్పటికే కొన్ని సినిమాలను నిర్మించిన విషయం తెల్సిందే.మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమా నిర్మాణంలో కూడా సుకుమార్‌ భాగస్వామ్యం ఉంది.

 Harish Shankar Want To Step In Productions Side, Sukumar, Harish Shankar, Pawan-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఉప్పెన సినిమాతో నిర్మాతగా సుకుమార్‌ సక్సెస్‌ అవుతాడనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.ఇదే సమయంలో సుకుమార్‌ మరికొన్ని సినిమాలను కూడా నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడట.

సినిమా సినిమాకు మద్య గ్యాప్‌ వస్తున్న కారణంగా నిర్మాణంపై దృష్టి పెట్టిన సుకుమార్‌ను అనుసరించి హరీష్‌ శంకర్‌ కూడా డైరెక్షన్‌ వైపు మొగ్గు చూపుతున్నాడు.

గద్దలకొండ గణేష్‌ చిత్రం తర్వాత హరీష్‌ శంకర్‌కు పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా చేసే అవకాశం వచ్చింది.

అయితే పవన్‌ ఇప్పటికే వకీల్‌ సాబ్‌ ఇంకా క్రిష్‌ మూవీ ఒప్పుకుని ఉన్నాడు.ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే ఈయనకు డేట్లు ఇస్తాడని అంటున్నారు.

కనుక హరీష్‌ శంకర్‌ వద్ద చాలా సమయం ఉంది.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యిందట.

ఆ కారణంగానే నిర్మాణంపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

Telugu Bunny Vasu, Geetha, Harish Shankar, Krish, Pawan Kalyan, Sukumar, Vakeel

గీతాఆర్ట్స్‌ 2 పై బన్నీ వాసు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు.ఆయనతో కలిసి హరీష్‌ శంకర్‌ ఒక సినిమాను నిర్మించబోతున్నాడు.అందుకు గాను ఇప్పటికే ఒక స్క్రిప్ట్‌ ఓకే చేశారు.

కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.యంగ్‌ హీరోతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

దర్శకుడిగా మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు నిర్మాతగా సక్సెస్‌ అయ్యేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube