బన్నీని అర్థం చేసుకున్న సుకుమార్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Sukumar-good-news-to-stylsh-star-allu-arjun-fans, Sukumar Good News  To Stylsh S-TeluguStop.com

ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకప్ కోసమే గంటల సమయం పడుతోందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా అంతా బన్నీ రగ్గుడ్ లుక్ లో కనిపించబోతున్నారు.

స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్పరాజ్ లాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.అయితే సినిమా అంతా ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్న అల్లు అర్జున్ ను సుకుమార్ పాటల్లో మాత్రం సూపర్ గెటప్ లలో చూపించబోతున్నారని బన్నీ పాటల్లో గత సినిమాల మాదిరిగా ఈ సినిమా పాటల్లో స్టైలిష్ లుక్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

బన్నీని, బన్నీ ఫ్యాన్స్ మనస్సును అర్థం చేసుకున్న సుకుమార్ బన్నీ పాటల్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో దుమ్ము రేపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లు కావడంతో ఈ సినిమా పాటలు కూడా అంచనాలను మించి సక్సెస్ అవుతాయని భావిస్తున్నారు.ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు.

Telugu Allu Arjun Fans, Pushpa, Sukumar-Movie

బన్నీ, రష్మిక కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే కాగా రష్మిక నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ ఏడాది ఆగష్టు 13న ఈ సినిమా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube