'ఉప్పెన' వల్ల సుకుమార్‌కు దక్కింది ఎంతో తెలుసా?

ఉప్పెన సినిమా ను నిర్మించింది ఎవరు అంటే మైత్రి మూవీ మేకర్స్‌ అనడంలో సందేహం లేదు.అయితే సహ నిర్మాతగా సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్‌ కూడా వ్యవహరించింది.

 Sukumar Gets Big Amount From Uppena Team-TeluguStop.com

సుకుమార్‌ తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేయడంతో పాటు ఆ సినిమాలకు సహ నిర్మాతగా ఉంటూ సినిమా లో కీలక విషయాలను చూసుకుంటూ స్క్రిప్ట్‌ మరియు ఇతర విషయాలపై తన శిష్యులకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు.అలా దర్శకత్వ పర్యవేక్షణ చేయడం ద్వారా నిర్మాతగా కొంత షేర్‌ ను దక్కించుకుంటాడు.

సినిమా సక్సెస్ అయితే లాభాల్లో వాటాను దక్కించుకునే సుకుమార్‌ నష్టాలతో సంబంధం లేదని ముందే ఒప్పందం చేసుకుంటాడు.ఉప్పెన సినిమా విషయమై కూడా అలాంటి ఒప్పందంనే మైత్రి వారితో సుకుమార్‌ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Sukumar Gets Big Amount From Uppena Team-ఉప్పెన’ వల్ల సుకుమార్‌కు దక్కింది ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపుగా 25 శాతం వాటాను సుకుమార్‌ మైత్రి వారి నుండి దక్కించుకున్నాడు.

పెట్టుబడి తీసుకున్న తర్వాత వచ్చిన లాభాల్లోంచి 25 శాతంను సుకుమార్‌ కు ఇచ్చేట్లుగా ఒప్పందం చేసుకున్నారు.అయితే ఈ ఒప్పందం విషయం లో ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సుకుమార్‌ దాదాపుగా రూ.20 కోట్ల రూపాయలను దక్కించుకున్నాడట.ఈ సినిమా వసూళ్లు ఓటీటీ రైట్స్‌ శాటిలైట్‌ రైట్స్ ఇలా అన్ని రైట్స్ ద్వారా వంద కోట్లకు పైగానే వచ్చాయి.ఆ మొత్తం నుండి బడ్జెట్ ను తొలగిస్తే నిర్మాతలకు దాదాపుగా 80 కోట్లకు పైగా వచ్చినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.అంతటి లాభాలు రావడంతో సుకుమార్‌ కు రూ.20 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.రూపాయి పెట్టుబడి పెట్టకుండా తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేసి మంచి పేరును దక్కించుకోవడం తో పాటు ఇంత తన సినిమాకు తీసుకునే పారితోషికం స్థాయిలో లాభాలను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఇది కేవలం సుకుమార్ కే సాధ్యం అయ్యిందని అంటున్నారు.

#20Crores #SukumarGets #Buchibaabu #Vaishnav Tej #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు