సెల్ఫిష్ గా మారిన సుకుమార్.. దిల్ రాజు కోసమేనట..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు.ఈ సినిమాతో సుకుమార్ మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Sukumar Coproduces Dil Raju Nephew Ashish's Next Film, Dil Raju, Ashish Reddy, Sukumar, Coproducer, Selfish-TeluguStop.com

ఈ సినిమాతో తనని తాను మరోసారి నిరూపించు కున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈయన దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 మీద తన ధ్యాస మొత్తం పెట్టేసాడు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి.

 Sukumar Coproduces Dil Raju Nephew Ashish's Next Film, Dil Raju, Ashish Reddy, Sukumar, Coproducer, Selfish-సెల్ఫిష్ గా మారిన సుకుమార్.. దిల్ రాజు కోసమేనట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ డిసెంబర్ లోనే మళ్ళీ పార్ట్ 2 తో రావాలని అనుకుంటున్నారు.

ఈ సమయంలోనే ఆయన నిర్మాణ సంస్థలో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు సుకుమార్.

ఇప్పటి వరకు తన సొంత బ్యానర్ అయినా సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన సినిమాలకు కథ విషయంలో ఇంకా స్క్రీన్ ప్లే విషయంలో సలహాలు సూచనలు ఇచ్చేవాడు.

అయితే ఇప్పుడు మొదలు పెట్టిన సినిమాకు మాత్రం సుకుమార్ అన్ని తానై ముందుకు తీసుకు వెళ్లబోతున్నాడు. సెల్ఫిష్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు సలహాలు సూచనలు చేయబోతున్నాడట.

Telugu Ashish Reddy, Coproducer, Dil Raju, Selfish, Sukumar, Sukumardil-Movie

ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోతుంది.ఈ సినిమాకు సుకుమార్ సమర్పకుడిగా ఉండేందుకు ఓకే చెప్పాడు.సుకుమార్ దిల్ రాజు నిర్మాణంలోనే ఫస్ట్ సినిమా చేసాడు.మళ్ళీ ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేయలేదు.ఇక ఇప్పుడు సెల్ఫిష్ తో ఈ కాంబో కనిపించ బోతుంది.దిల్ రాజు వారసుడు అయినా ఆశిష్ తో సినిమాను చేయాలనీ భావిస్తున్నాడు.

ఆశిష్ మొదటి సినిమా రౌడీ బాయ్స్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు.దాంతో సుకుమార్ భాగస్వామ్యంలో సినిమా చేయాలనీ దిల్ రాజు నిర్ణయం తీసుకున్నాడట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube