నాన్నను తలుచుకుంటూ ఎమోషనల్ అయిన సుకుమార్.. ఏమైందంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో విజయాలను అందుకుని స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకున్నారు.సుకుమార్ శిష్యులు కూడా దర్శకులుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకోగా తాజాగా సుకుమార్ సొంతూరిలో పాఠశాల భవనంను ప్రారంభించారు.

 Director Sukumar Comments About His Father Tirupati Nayudu, Comments About Fathe-TeluguStop.com

సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి ఉద్యోగంను వదిలి వెళతానని చెప్పిన సమయంలో తండ్రి సపోర్టు చేశారని సుకుమార్ అన్నారు.

తండ్రి తనను ప్రోత్సహించడంతో పాటు ధైర్యం చెప్పారని సుకుమార్ చెప్పుకొచ్చారు.

సుకుమార్ తన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలంలో ఉన్న మట్టపర్రులో పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.తన తండ్రి తిరుపతి నాయుడు పేరుపై సుకుమార్ అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు ఏకంగా 18 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం గమనార్హం.

Telugu Rupees, Godavari, Pushpa, School, Sukumar, Tirupati Nayudu-Movie

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సుకుమార్ తో కలిసి రాపాక వరప్రసాద్ పాఠశాల భవనాన్ని ప్రారంభించగా తండ్రిని తలుచుకుంటూ సుకుమార్ ఎమోషనల్ కావడం గమనార్హం.తండ్రి ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని సుకుమార్ అన్నారు.సుకుమార్ తన స్వగ్రామానికి అందిస్తున్న సేవలను రాపాక వరప్రసాదరావు మెచ్చుకున్నారు.

Telugu Rupees, Godavari, Pushpa, School, Sukumar, Tirupati Nayudu-Movie

ప్రస్తుతం సుకుమార్ బన్నీతో పుష్ప పార్ట్ 1 తెరకెక్కిస్తుండగా పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండతో సుకుమార్ ఒక సినిమాను తెరకెక్కించాల్సి ఉండగా ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన సైతం వెలువడాల్సి ఉంది.తన సినిమాలతో హీరోల లుక్ ను మార్చే సుకుమార్ విజయ్ దేవరకొండను తన సినిమాలో కొత్త లుక్ లో చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు పుష్ప సినిమా ఈ ఏడాదే రిలీజవుతుందో లేక వచ్చే ఏడాదికి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube