మహేష్‌, సుకుమార్‌ల 'మైత్రి'కి ప్రయత్నం  

Sukumar And Mythri Movie Makers Meeting With Mahesh After Drift-maharshi Movie Sets,mahesh Babu,sukumar And Mythri Movie Makers

మహేష్‌, సుకుమార్‌ల మద్య విభేదాలు తలెత్తిన విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మహేష్‌ బాబు 26వ చిత్రాన్ని చేయాల్సిన సుకుమార్‌ త్వరలో అల్లు అర్జున్‌తో సినిమాను చేయబోతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేయాలన్సి మహేష్‌ బాబు అనీల్‌ రావిపూడితో చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ పరిణామాలు సుకుమార్‌ మహేష్‌బాబుల మద్య విభేదాలు తలెత్తాయి అని చెప్పకనే చెబుతున్నాయి...

మహేష్‌, సుకుమార్‌ల 'మైత్రి'కి ప్రయత్నం-Sukumar And Mythri Movie Makers Meeting With Mahesh After Drift

వీరిద్దరి మద్య కథ పరమైన విభేదాలు రావడం వల్లే సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. సినిమా క్యాన్సిల్‌ అయినా కూడా సుకుమార్‌, మహేష్‌ల మద్య విభేదాలు లేకుండా చూడాలని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటి నుండి మహేష్‌ బాబు, సుకుమార్‌ల కాంబినేషన్‌లో మూవీని మైత్రి వారు నిర్మించాలని భావించిన విషయం తెల్సిందే.

అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కలేదు. ఎప్పుడైతే మహేష్‌ తదుపరి చిత్రాన్ని అనీల్‌ రావిపూడి అంటూ ప్రకటించాడో అప్పుడే అల్లు అర్జున్‌ను రంగంలోకి దించిన మైత్రి వారు ఆయనకు అడ్వాన్స్‌ కూడా ఇవ్వడం జరిగింది.

ఇలాంటి సమయంలో మహేష్‌ మైత్రి వారిపై కూడా చాలా కోపంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ అయిన మహేష్‌ బాబుతో విభేదాలు తగవనే ఉద్దేశ్యంతో మహేష్‌ బాబును కలిసేందుకు మైత్రి వారు సుకుమార్‌ను వెంట బెట్టుకుని మరీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే మహర్షి సెట్టింగ్‌లో మహేష్‌బాబును సుకుమార్‌తో పాటు మైత్రి నిర్మాతలు కలిశారని, దాదాపు అర్థగంట పాటు చర్చలు జరిగాయంటూ ప్రచారం జరుగుతుంది. ఇద్దరి మద్య విభేదాలు లేవు అని చెప్పేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఎంత చేసినా కూడా మహేష్‌బాబు, సుకుమార్‌ల మూవీ ఇప్పట్లో వర్కౌట్‌ అవ్వదు అనేది వాస్తవం.