సుకుమార్, దేవిశ్రీ రాక్ స్టార్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లేనా

క్రియేటివ్ టాలెంటెడ్ దర్శకుడుగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుకుమార్, సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్స్ అని చెప్పాలి.వారిద్దరి కాంబినేషన్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కుతుంది.

 Sukumar And Devi Sri Prasad Rockstar Movie Stopped-TeluguStop.com

సుకుమార్, మైత్రీ కాంబోలో తెరకెక్కిన ఉప్పెన సినిమాకి కూడా దేవిశ్రీ సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి.ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రెండేళ్ళ క్రితం రాక్ స్టార్ టైటిల్ తో ఒక మూవీని ఎనౌన్స్ చేశారు.

ఇందులో దేవిశ్రీ తన నిజ జీవిత పాత్రనే పోషిస్తాడని కూడా చెప్పారు.అయితే ఏమైందో గాని ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన ఊసే లేదు.

 Sukumar And Devi Sri Prasad Rockstar Movie Stopped-సుకుమార్, దేవిశ్రీ రాక్ స్టార్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుకుమార్, దేవిశ్రీ కలిసి సినిమాలు చేసుకుంటున్న రాక్ స్టార్ సినిమా ప్రస్తావన మాత్రం ఈ మధ్య కాలంలో రాలేదు.సుకుమార్ ప్రస్తుతం పుష్పతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

నెక్స్ట్ రామ్ చరణ్ తో కూడా పాన్ ఇండియా సినిమానే చేస్తున్నాడు.దాని తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా ఉంది.

ఇలా సుకుమార్ వరుస ప్రాజెక్ట్ లని సుకుమార్ లైన్ లో పెట్టుకున్నాడు.వీటికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గానే ఉండనున్నారు.

మరి వీటి తర్వాత దేవిశ్రీతో సుకుమార్ సినిమా చేయాలంటే కచ్చితంగా అది కూడా పాన్ ఇండియా మూవీనే అవ్వాలి.లేదంటే తన శిష్యులకి రాక్ స్టార్ మూవీ బాద్యతలని అప్పగించాలి.

అయితే ఆ అవకాశం లేదనే చెప్పాలి.ఈ నేపధ్యం వీరిద్దరి కలయికలో ఎనౌన్స్ చేసిన రాక్ స్టార్ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే మాట ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

#Devi Sri Prasad #MythriMovie #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు