పాపం సుకుమార్‌కే ఎందుకు ఇలా జరుగుతుంది?  

sukumar and allu arjun movie post pone - Telugu Allu Arjun Ala Vaikuntapuramlo, Allu Arjun And Sukumar, Corona Virus In Kerala, Rangasthalam Sukumar, Sukumar

రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్‌ అనే విషయం తెల్సిందే.నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్న రంగస్థలం చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించాడు.

TeluguStop.com - Sukumar And Allu Arjun Movie Post Pone

ఏ దర్శకుడు అయినా చిన్న హిట్‌ వస్తే వరుసగా సినిమాలను ప్లాన్‌ చేసుకుంటాడు.ఆ హిట్‌ను క్యాష్‌ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు.

కాని సుకుమార్‌ లక్‌ సరిగా లేదో లేకుంటే ఆయన ప్లానింగ్‌ సరిగా లేదో కాని ఆయన రంగస్థలం వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఏళ్లు ఆగాల్సి వస్తుంది.

TeluguStop.com - పాపం సుకుమార్‌కే ఎందుకు ఇలా జరుగుతుంది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రంగస్థలం చిత్రం వచ్చిన వెంటనే మహేష్‌బాబుతో సినిమా అనుకున్నాడు.

కాని మహేష్‌బాబుతో క్రియేటివ్‌ డిఫరెన్స్‌ రావడంతో ఆయనతో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.బన్నీతో సినిమా సెట్‌ చేసుకున్నాడు.

గత ఆరు ఏడు నెలలుగా వెంట తిప్పుకుంటున్నాడు తప్ప డేట్లు ఇవ్వలేదు.అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్న బన్నీ ఎంతకు సుకుమార్‌కు దొరకలేదు.

చివరకు బన్నీ దొరికిన సమయానికి షూటింగ్‌ మొదలు పెట్టాలనుకున్న సమయానికి కరోనా కల్లోలం మొదలైంది.

బన్నీతో ఫారెస్ట్‌ నేపథ్యంలో సినిమాను తీయాలని సుకుమార్‌ అనుకుంటున్నాడు.అందుకోసం కేరళలో చిత్రీకరణ జరపాలని షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాడు.అయితే కేరళలో కరోనా వల్ల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో అక్కడకు వెళ్లడం కుదరని పని.అందుకే షూటింగ్‌ వాయిదా వేశారు.ఎప్పటికి షూటింగ్‌ ప్రారంభం అయ్యేది చెప్పలేని పరిస్థితి.పాపం సుకుమార్‌ ఇంకా ఎంత కాలం వెయిట్‌ చేయాలో అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#Sukumar #AlluArjun #CoronaVirus #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sukumar And Allu Arjun Movie Post Pone Related Telugu News,Photos/Pics,Images..