పుష్ప కోసం మలయాళం స్టార్ ని రంగంలోకి దించుతున్న బన్నీ

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కి తెలుగులో ఎంత పాపులారిటీ ఉందో మలయాళంలో కూడా అంతే స్థాయిలో ఉంది.బన్నీ సినిమాలు మలయాళంలో కూడా డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ అయిన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ ఉంటాయి.

 Sukumar Allu Arjun Pushpa Malayam Star Mammootty-TeluguStop.com

దీంతో బన్నీకి అక్కడ కూడా లక్షలలో అభిమానులు ఉన్నారు.అతని సినిమాకి సంబందించిన ఎలాంటి అప్డేట్ వచ్చిన తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇక తాజాగా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా తెలుగుతో పాటు మలయాళంలో మంచి హిట్ అయ్యింది.ఈ సినిమాను మలయాళ భాషలో అంగు వైకుంఠపురతు టైటిల్ తో విడుదల చేశారు.

 Sukumar Allu Arjun Pushpa Malayam Star Mammootty-పుష్ప కోసం మలయాళం స్టార్ ని రంగంలోకి దించుతున్న బన్నీ-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ భారీ వసూళ్లను సాధించింది.

ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో మలయాళం ప్రేక్షకులని అలరించిన బన్నీ ఇప్పుడు సుకుమార్ పుష్ప సినిమాతో నేరుగానే అలరించడానికి రెడీ అవుతున్నాడు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మలయాళంలో కూడా స్ట్రైట్ గా తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం బన్నీ సొంతంగా మలయాళంలో డబ్బింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అలాగే సినిమాలో కీలక పాత్ర కోసం మలయాళం స్టార్ హీరోలైన మమ్ముట్టి, సురేష్ గోపిలని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.  సినిమాలో పాత్ర ప్రాధాన్యత బట్టి వారిలో ఒకరిని కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

#South #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు