ఏదేమైనా అతడిని వదలనంటున్న సుకుమార్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన సినిమాలను తెరకెక్కించి వాటితో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తు్న్నాడో అందరికీ తెలిసిందే.ఆర్య సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తన సత్తా చాటుతూ వచ్చిన సుకుమార్ రంగస్థలం సినిమా వరకు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే హిట్స్ అందించాడు.

 Sukumar Will Not Leave Devisri Prasad At Any Cost  Sukumar, Allu Arjun, Pushpa,-TeluguStop.com

ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ముచ్చటగా మూడోసారి అదిరిపోయే సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు సుక్కు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగా, తాజాగా నేడు పుష్ప అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

కాగా సుకుమార్ తన చిత్రాలకు సంగీతాన్ని అందించే బాధ్యత ఒక్క దేవిశ్రీ ప్రసాద్‌కు మాత్రమే ఇస్తూ వస్తున్నాడు.తన సినిమాలో హీరో ఎవరైనా సంగీతం మాత్రం దేవిశ్రీ ఇవ్వాల్సిందే.

సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ అందించే సంగీతం కూడా సూపర్ సక్సెస్ అవుతుండటమే దీనికి కారణం.అయితే గతకొంత కాలంగా దేవిశ్రీ ఫాంలో లేడని అందరూ అంటున్నా సుకుమార్ మాత్రం మళ్లీ ఆయనకే దక్కింది.

ఏదేమైనా తన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని మాత్రం వదలనని సుకుమార్ అంటున్నాడు.మరి బన్నీ కోసం ఈసారి దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube