సుఖీభ‌వ వీడియోను అందుకోసం వాడేసిన స‌జ్జ‌నార్‌..

‘అయ్యయ్యో వద్దమ్మా.’ అంటూ ఓ టీ కంపెనీ చేసిన యాడ్ చాలా ఫేమస్ అయింది.

 Sukhibhava Video Used For That By Sajjanar-TeluguStop.com

ఎంతలా అంటే దానిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.దీనికి చాలా మంది చాలా రకాలుగా ఫన్నీ కామెంట్స్ రూపంలో ఉపయోగిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ యాడ్‌కు సంబంధించిన డైలాగ్‌ను ఉపయోగించి తీన్మార్ స్టెప్పులుగా మార్చాడు.ప్రస్తుతం అది కూడా ఓ రేంజ్ లో వైరల్ అయింది.

 Sukhibhava Video Used For That By Sajjanar-సుఖీభ‌వ వీడియోను అందుకోసం వాడేసిన స‌జ్జ‌నార్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్ లో దానిని ఇమిటేట్ చేస్తూ సోషల్‌మీడియాలో దుమ్ము లేపుతున్నారు.ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను సెట్ చేసే వారిగా గుర్తింపు కలిగిన ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.

అప్పటి నుంచి సంస్థ డెవలప్ మెంట్ కోసం కొత్త ఐడియాలను తీసుకొస్తున్నారు.ఇక ప్రస్తుతం అయ్యయ్యో వద్దమా.

అనే డైలాగ్ ను తనదైన శైలిలో ఉపయోగించారు.టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి కోసం వాడేశారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ కావడం లేదు.ఇంతకీ ఆయన ఏం చేశారంటే.

‘అయ్యయ్యో వద్దన్నా….పక్కనే.టీఎస్ఆర్టీసీ బస్ ఉన్నది.క్షేమంగా వెళ్లవచ్చు.

డబ్బులను సైతం ఎక్కువగా తీసుకోరు.కానీ.

సుఖీభవ.సుఖీభవ.

’ అని దీవిస్తాడు.ఆ తర్వాత మ్యూజిక్‌‌కు అనుగుణంగా స్టెప్పులేస్తాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సీవీ సజ్జనార్ ట్విట్టరు వేదికగా పోస్ట్ చేశారు.‘అయ్యయ్యో.వద్దమ్మా.కానీ, సుఖీభ‌వ‌.సుఖీభ‌వ‌.నమ్మకానికి మన టీఎస్ఆర్‌టీసీ భరోసా’అని క్యాప్షన్‌గా పెట్టారు.

దీనికి తోడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితం.సుఖమయం.

శుభప్రదం.అంటూ రాశారు.

ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది.సీవీ సజ్జనార్ ఎక్కడున్నా గానీ తన మార్కును చూపిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరి మీరు సైతం ఇలాంటి వాటిని ఇమిటేట్ చేస్తున్నారా?

.

#TSRTC #TSRTC Bus #Tweet #Sukhibhava #Sajjanar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు