ఆ ఇద్దరు దర్శకులు చరణ్‌ వెంట పడుతున్నారట

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు.మరో మూడు నెలల్లో ఆ సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉంది.

 Sujith And Anil Ravipudi Run To Next Movie With Charan-TeluguStop.com

అంటే సమ్మర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం పూర్తి చేసి సమ్మర్‌ చివరి వరకు లేదంటే ఈ ఏడాది చివరి వరకు చరణ్‌ కొత్త సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది.ఒక వైపు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో ఖరారు చేసుకున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు చరణ్‌ తదుపరి చిత్రం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Anilravipudi, Charan, Sujithanil, Sujith Charan, Sujith Latest, Sujith Sa

  ఈ సమయంలో రామ్‌ చరణ్‌ చుట్టు ఇద్దరు దర్శకులు చక్కర్లు కొడుతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అందులో మొదటి దర్శకుడు సుజీత్‌.సాహో వంటి బిగ్గెస్ట్‌ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్‌ తన మూడవ సినిమాను చరణ్‌తో చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

సాహో చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తీశానంటూ చెప్పుకుంటున్న సుజీత్‌ ఆ సినిమాతో కలెక్షన్స్‌ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేక పోయాడు.అయినా కూడా చరణ్‌తో మంచి సినిమా చేస్తానంటున్నాడు.

Telugu Anilravipudi, Charan, Sujithanil, Sujith Charan, Sujith Latest, Sujith Sa

  సుజీత్‌తో పాటు అనీల్‌ రావిపూడి కూడా చరణ్‌తో సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయన ఒక వైపు ఎఫ్‌ 3 చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ చూసుకుంటూనే మరో వైపు తాను గతంలో చరణ్‌ కోసం రాసుకున్న ఒక స్క్రిప్ట్‌ను వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.వీరిద్దరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు దర్శకులు కూడా చరణ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.మరి చరణ్‌ ఏ దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube