త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న సాహో డైరెక్టర్  

Sujeeth To Get Engaged Very Soon - Telugu Engagement, Lucifer Remake, Saaho, Sujeeth

టాలీవుడ్‌లో రన్ రాజా రన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన యంగ్ డైరెక్టర్ సుజీత్ తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.ఈ సినిమాతో శర్వానంద్‌కు అదిరిపోయే హిట్ అందించిన సుజీత్ ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

 Sujeeth To Get Engaged Very Soon

అలా అని చిన్నాచితకా సినిమాతో సుజీత్ మనముందుక రాలేదు.ఏకంగా ప్రభాస్ హీరోగా ‘సాహో’ అనే భారీ బడ్జెట్ చిత్రంతో మనముందుకు వచ్చాడు సుజీత్.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించడంలో సుజీత్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఇక ఈ సినిమా కూడా సుజీత్‌కు మంచి పేరు తీసుకురావడంతో ఇప్పుడు మరో మెగా ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న సాహో డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image

మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సుజీత్ రెడీ అయ్యాడు.కాగా సుజీత్ తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అడుగు వేసేందుకు రెడీ అయ్యాడు.

గతకొంత కాలంగా తాన ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సుజీత్ రెడీ అవుతున్నాడు.వృత్తిపరంగా డెంటిస్ట్ అయిన డా.

ప్రవల్లికను గతకొంత కాలంగా ప్రేమిస్తున్న సుజీత్, ఇరు కుటుంబాల అంగీకారంతో జూన్ 10న నిశ్చితార్థం చేసుకునేందుకు రెడీ అయ్యాడు.ఇక ఎంగేజ్‌మెంట్‌తో పాటు పెళ్లి కూడా త్వరలోనే జరుపుకునేందుకు సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు.

ఏదేమైనా పెళ్లితో ఓ ఇంటివాడయ్యేందుకు సుజీత్ సిద్ధం కావడంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అటు లూసిఫర్ తెలుగు రీమేక్ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సుజీత్ రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sujeeth To Get Engaged Very Soon Related Telugu News,Photos/Pics,Images..

footer-test