సుజీత్ దర్శకత్వంలో గోపీచంద్ యాక్షన్ మూవీ  

Sujeeth back in UV camp for Gopichand, Tollywood, Telugu Cinema, South Cinema, UV Creations, Gopichand,Sampath Nandi - Telugu Gopichand, Sampath Nandi, South Cinema, Sujeeth, Sujeeth Back In Uv Camp For Gopichand, Telugu Cinema, Tollywood, Uv Creations

యాక్షన్ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్.ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది.

TeluguStop.com - Sujeeth To Direct Gopichand Uv Banner

కబడ్డీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇందులో గోపీచంద్ కి జోడీగా తమన్నా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో అలివేలు వెంకటరమణ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో గోపీచంద్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభమయ్యే అవకాశం ఉంది.

TeluguStop.com - సుజీత్ దర్శకత్వంలో గోపీచంద్ యాక్షన్ మూవీ-Gossips-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే యూవీ క్రియేషన్స్ సంస్థ గోపీచంద్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తుంది.ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో గోపీచంద్ తో వరుస సినిమాలు చేయాలని యూవీ క్రియేషన్స్ సంస్థ భావిస్తుంది.

అలాగే తమ బ్యానర్ లో, రన్ రాజా రన్, సాహో సినిమాలు చేసిన సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి యూవీ సిద్ధం అవుతుంది.ఈ నేపధ్యంలో సుజిత్ దర్శకత్వంలో గోపీచంద్ హీరో గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నారు.దీనికి సంబంధించి రంగం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.

సుజిత్ ఇప్పటికే ఒక స్టొరీ లైన్ చెప్పి యూవీ క్రియేషన్స్ ని ఒప్పించినట్లు సమాచారం.రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ కి సుజిత్ ని సంప్రదించారు.

అయితే యూవీ బ్యానర్ లో ఉన్న కమిట్మెంట్ కారణంగా ఆ సినిమాని వదులుకున్నాడు.వచ్చే ఏడాది గోపీచంద్, సుజిత్ కాంబినేషన్ సినిమాని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

#Sujeeth #Gopichand #UV Creations #Sampath Nandi #SujeethBack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు