బెల్లంకొండ బాబుకు ఝలకిచ్చిన డైరెక్టర్  

Sujeeth Rejected Bellamkonda Sreenivas, Bellamkonda Sreenivas, Chatrapathi, Remake, Sujeeth, Tollywood News - Telugu Bellamkonda Sreenivas, Chatrapathi, Remake, Sujeeth, Tollywood News

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - Sujeeth Rejected Bellamkonda Sreenivas

అయితే కొద్దిరోజులుగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగులో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో హీరోగా బెల్లంకొండ బాబు నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు అక్కడి నిర్మాతలు రెడీ అవుతున్నారు.కాగా ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

TeluguStop.com - బెల్లంకొండ బాబుకు ఝలకిచ్చిన డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేయనున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ వస్తోంది.కానీ ఈ సినిమాను తాను డైరెక్ట్ చేయడం లేదని సుజీత్ క్లారిటీ ఇచ్చేశాడు.

దీంతో బెల్లంకొండ హీరోకు ఝలక్ ఇచ్చాడు సుజీత్.రీమేక్ చిత్రాలను తాను చేయనని, కేవలం స్ట్రెయిట్ చిత్రాలనే తెరకెక్కిస్తానని సుజీత్ తెలిపాడు.

ఇక చేసేదేమీ లేక మరో డైరెక్టర్ కోసం హీరో మరియు ప్రొడ్యూసర్ అన్వేషిస్తున్నారు.బాలీవుడ్ డైరెక్టర్ అయితే ఈ సినిమాను పక్కాగా తెరకెక్కించగలడని వారు భావిస్తున్నారు.

దీంతో ఛత్రపతి హిందీ రీమేక్‌ను ఎవరు హ్యాండిల్ చేస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ అదిరిపోయే విధంగా మేకవర్ చేస్తున్నాడు.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసి, అదిరిపోయే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఈ హీరో చూస్తున్నాడు.మరి ఈ హీరోను బాలీవుడ్‌లో అదిరిపోయే విధంగా ఎవరు చూపిస్తారా అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

#Remake #Chatrapathi #Sujeeth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sujeeth Rejected Bellamkonda Sreenivas Related Telugu News,Photos/Pics,Images..