ఆ వీడియోలు ఎవరు లీక్ చేశారు ? రంగంలోకి కేంద్రం ?

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన పార్క్ హయత్ హోటల్ సీసీ టీవీ ఫుటేజీలకు సంబంధించి ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది.ఆ హోటల్లో ఏపీ ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస రావు, ఈ ముగ్గురికి సంబంధించిన వీడియో సాక్షాలు అంటే సీసీ టీవీ పుటేజ్ బయటికి రావడం వంటి సంఘటనలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.

 Sujana Chowdary,cctv Footage Leak, Park Hyatt Hotel,sujanna Chowdary Letter, Raj-TeluguStop.com

అయితే ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.అసలు పార్క్ హయత్ హోటల్లో నిఘా ఎవరు ఏర్పాటు చేశారు ? నిఘా వర్గాలు తీసుకున్న సీసీ టీవీ పుటేజ్ కేవలం ఒక మీడియా ఛానెల్ కు మాత్రమే ఏవిధంగా అందింది వంటి అంశాలపై క్లారిటీ తెచ్చుకుని ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది అనే అంశాలపై క్లారిటీ తెచ్చుకునేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే ఈ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఎంపీల భద్రతను సీరియస్ గా తీసుకునే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపై అంతర్గతంగా విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లీక్ కావడానికి అవకాశం ఉండదు.ఆ విధంగా జరిగితే, ఆ వ్యాపార సంస్థకు చాలా ఇబ్బంది.అసలు ఆ సీసీ టీవీ ఫుటేజ్ పార్క్ హయత్ హోటల్ లీక్ చేయలేదని, అధికారికంగా లేఖ రాసి వాటిని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.కాకపోతే ఒక లేఖ రాసినంత మాత్రాన, సీసీ టీవీ పుటేజ్ఇవ్వరు.

అక్కడకు ఎవరైనా నిందితులు వచ్చారని, విచారణకు తప్పనిసరిగా ఆ వీడియో సాక్షాలు కావాలని చెప్పి వాటిని సేకరించి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Rajyasabha, Sujana Chowdary, Sujannachowdary-Telugu Political News

ఇక ఈ వ్యవహారాన్ని సుజనా చౌదరి సీరియస్ గా తీసుకున్నారు.ఈ సిసి టీవీ ఫుటేజ్ లీక్ అయిన వెంటనే, ఆయన తన సర్వీస్ అపార్ట్మెంట్ ఖాళీ చేసేసారు.అసలు ఈ వ్యవహారం ఎందుకు జరిగింది ? ఎలా జరిగింది ? అనే అంశాలపైన ఆయన ఆరా తీస్తున్నారు.సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడు కావడంతో, రాజ్యసభ చైర్మన్ ద్వారా ఈ వ్యవహారం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించే విధంగా సుజనా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube