చంద్రబాబు కి భారీ షాక్..బీజేపి లోకి సుజనా చౌదరి..?       2018-04-25   04:33:29  IST  Bhanu C

ఒక వైపు చంద్రబాబు అటు బీజేపి ఇటు వైసీపి నుంచీ నేతలని ఎలాగైనా సరే టీడీపీ లోకి రప్పించాలని చూస్తుంటే మరో వైపు బీజేపి నేతలు మాత్రం చంద్రబాబు కుభాస్థలం పైనే కొట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది..అందుకు అనుగుణంగానే చాలా కాలం నుంచీ ఎన్నో వ్యుహాలని రచించిన బీజేపి సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది..అయితే చద్న్రబాబు దీక్షలు చేస్తున్న సమయంలో గనుక తమ వ్యుహాలని ఒక్కొక్కటిని అమలు చేస్తూ ఉంటే తప్పకుండా చంద్రబాబు కి వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టచ్చని భావిస్తోంది..అయితే తాజా సమాచారం ప్రకారం టీడీపీకి మూలస్థంభం..చంద్రబాబు కి నమ్మిన బంటు అయిన సుజనా ని బీజేపి వైపుకి తిప్పుకుంటోంది కేంద్రం..ఇప్పుడు ఈ వార్త రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళ్తే


టీడీపీ, ఎన్డీయే నుంచీ విడిపోయిన తరువాత తమ పార్టీ నేతలపై వేదిపులు మొదలయ్యాయి అని చంద్రబాబు ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పారు అయితే ఈ క్రమంలో కేంద్రంతో వైరం వల్ల నష్టపోతున్న నేతలు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో బీజేపీతో దోస్తీ కి ఒకే చెప్పక తప్పడం లేదంట…ఈ విధంగానే టిడిపి ఎంపీ సుజనా చౌదరి బీజేపి లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది..అయితే ఇవి ఊహాజనితాలు కాదని ఇందుకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు..బీజేపి కి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సమయంలో ఒక కార్యక్రమానికి సుజనా హాజరు కాలేదని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో సుజనాపై అనుమానాలు ఏర్పడ్డాయి..అంతేకాదు జైట్లీతో సుజనా రహస్యంగా ఒక్కడే వెళ్లి మాట్లాడటం పలు అనుమానాలకి తావిస్తోంది..ఆ తరువాత టీవీ చానెల్ ఇంటర్వ్యూ లో కేంద్రం ఏపీ పై ఎలాంటి కుట్రలు పన్నలేదని చెప్పారు..ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులని ఆశ్చర్య పరిచాయి..ఇవన్నీ పక్కన పెడితే సుజనా తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి గవర్నర్ ని కలిశారని..సుదీర్గంగా వారి మధ్య చర్చలు జరిగాయని టాక్ కూడా వినిపించింది అయితే ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందనేది పక్కన పెడితే..సుజనా బీజేపి లోకి వెళ్ళడం ఖాయం అంటూ మరొక ఆధారం అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి..

పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా న్యూస్ చానెల్స్ పై చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే వాటిలో మహా న్యూస్ ఛానెల్ కి కూడా పవన్ వార్నింగ్ ఇచ్చారు..అయితే తరువాత కేవలం మూడు న్యూస్ చానెళ్ళు పై తన అస్త్రం ఎక్కుపెట్టారు..అయితే పవన సుజనా భేటీ తరువాత మాత్రం పవన్ చాలా సైలెంట్ అయ్యారు..దాంతో సుజనా అభ్యర్ధాన మేరకే పవన్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది..సుజన బిజెపి కి దెగ్గర అవుతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి కావాలనే ఆ మీడియా అధినేత సుజనాపై ఈ రకమైన కామెంట్స్ చేస్తునారని తెలుస్తోంది..కావాలనే సుజనాని ఆ మీడియా అధిపతి దూరం చేస్తున్నారని అందుకే యనమల కూడా ఈ మధ్య చంద్రబాబు దగర ఈ విషయాన్ని ప్రస్తావించారని టాక్ వినిపిస్తోంద.అయితే తనపై ఎదో కుట్ర జరుగుతోందని గ్రహించిన సుజనా తానూ సేఫ్ సైడ్ లో ఉండటం ఎంతో మంచిదని భావించి త్వరలో బీజేపీ లోకి వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు..