బీజేపీలోకి టీడీపీ వలసలు! చక్రం తిప్పుతున్న ఆ ఇద్దరు  

Sujana Chowdary And Cm Ramesh Key Players In Bjp Operation Akarsh-bjp Operation Akarsh,sujana Chowdary And Cm Ramesh Key Players,tdp Party

ఏపీలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఎప్పుడు ఎవరు పార్టీ వీడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ నుంచి జారి పోతున్న నేతలని ఎలా ఆపాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటున్నారు..

బీజేపీలోకి టీడీపీ వలసలు! చక్రం తిప్పుతున్న ఆ ఇద్దరు-Sujana Chowdary And Cm Ramesh Key Players In BJP Operation Akarsh

అయిన కూడా టీడీపీలో ఉన్న నేతలు రాజకీయ భవిష్యత్తు, ఆర్ధిక అవసరాలు వెతుక్కుంటూ వలస బాట పడుతున్నారు. ఇప్పుడు నేతలు టీడీపీని వీడి బయటకి వెళ్ళిపోతూ ఉంటే చంద్రబాబు కూడా ఏమీ అనలేక సైలెంట్ గా చూస్తున్నారు. గత ఎన్నికలలో గెలుపు తర్వాత తాను చేసిన పనిని ఇప్పుడు పక్క పార్టీ చేస్తూ ఉండటంతో గట్టిగా విమర్శించాలన్న తిరిగి తన మీదనే ఎదురుదాడి తగులుతుంది అని సైలెంట్ అయిపోయారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీ పార్టీలోకి వలసలు పెరగడం వెనుక గతంలో వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి ప్రధాన కారణం అయిన సుజనా చౌదరి, సిఏం రమేష్ కారణం అని తెలుస్తుంది. వారే వెనకుండి మొత్తం గేమ్ నడిపిస్తూ టీడీపీ కీలక నేతలని ఒక్కొక్కరిగా బీజేపీలోకి వచ్చేలా చేస్తున్నారని, ఒకే సారి అందరూ రాజీనామా చేసి వచ్చేకంటే, ఒక్కొక్కరుగా వస్తే అది ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించి, టీడీపీ పార్టీ కనుమరుగు అవుతుంది అనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్తుందని, అలా చేయడం ద్వారా ఆ పార్టీకి ఉన్న క్రింది స్థాయి క్యాడర్ ని కూడా దూరం చేయొచ్చని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే ఓ వైపు ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తూ మరో వైపు ఫిరాయింపు నేతలకి బీజేపీలో చేర్చుకుంటున్నారు అని తెలుస్తుంది.