గుడివాడ టీడీపీ అభ్యర్థిగా సుహాసిని...? టీడీపీ ప్లాన్ ఇదేనా ..?

తెలంగాణ ఎన్నికల్లో బోర్లాపడ్డ టీడీపీ ఏపీ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడకుండా… ముందు జాగ్రత్తగా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.ముఖ్యంగా తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఎక్కువ ఫోకస్ పెట్టిన కూకట్ పల్లి నియోజకవర్గంలో ఓటమి చెందడం టీడీపీ ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Suhasini Tdp Going To Participate In Ap Elections Too-TeluguStop.com

ఈ నియోజకవర్గంలో నందమూరి ఫ్యామిలీ నుంచి గారికి టికెట్ ఇస్తే … తెలంగాణ, ఏపీలో పార్టీకి కలిసి వస్తుంది అని బాబు భావించాడు.అందుకే ఇక్కడ నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి టికెట్ ఇచ్చారు.

కానీ ఆ ఫలితం దక్కకపోవడంతో బాబు తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే ఇప్పడు అదే సుహాసినిని ఏపీ ఎన్నికల్లో పోటీకి దింపి అన్నిరకాలుగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని బాబు అండ్ కో బృందం ఆలోచనగా తెలుస్తోంది.

ఏపీ ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీ చరిష్మా ఉపయోగించుకునేందుకు బాబు బాగా ప్రయత్నిస్తున్నాడు.అందుకే అకస్మాత్తుగా అమరావతిలో నీరుకొండ మీద 406 కోట్లతో ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.అలాగే.మ‌రో నాలుగు ఐదు నెలల్లో ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని, ఏపీలో నంద‌మూరి ఫ్యామిలీకి సానుభూతి ఉంద‌ని అది ఉపయోగించుకోవాలని బాబు చూస్తున్నాడు.ఇప్ప‌టికే నంద‌మూరి కుటుంబం నుంచి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాల‌య్య ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇక నంద‌మూరి కుటుంబానికి కృష్ణా జిల్లాలో మంచి క్రేజ్ ఉంది.

హ‌రికృష్ణ‌కు ఇక్కడ మంచి కేడ‌ర్ కూడా ఉంది.ఇటీవల ఆయన మరణించడం … ఆ సెంటిమెంటు కూడా ఇక్క‌డ ప‌నిచేసే అవ‌కాశం ఉందని టీడీపీ ఆలోచన చేస్తోంది.v

అందుకే కృష్ణ జిల్లా గుడివాడ నుంచి సుహాసినిని ఎన్నికల్లో పోటీకి దించాలని కొత్తగా టీడీపీ వ్యూహం పన్నుతోంది.గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అయితే, సుహాసిని గెలుపు ఖాయం అని పార్టీ సీనియర్ నాయకులు లెక్కలు వేస్తున్నారు.నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.గ‌డిచిన మూడు ఎన్నిక‌ల నుంచి కూడా ఆయ‌నే గెలుస్తున్నారు.ఇప్పుడు కూడా ఆయ‌న‌కు ఇక్క‌డ ఎదురు లేదు.స్థానికంగా ఇక్కడ టీడీపీ పట్టు కోల్పోయింది.

ఇటువంటి పరిస్థితుల్లో సుహాసినిని రంగంలో దించడం ద్వారా కోడలి నాని హవాకు అడ్డు కట్ట వేసేందుకు వీలవుతుందని… తద్వారా… తనను రాజకీయంగా ఇబ్బందిపెడుతున్న నాని అడ్డు తొలిగించుకోవచ్చని బాబు భావిస్తున్నాడు.

నంద‌మూరి ఫ్యామిలీ అంటే కోడలి నానికి చాలా అభిమానం .వారి కోసం ఏమి చేసేందుకు అయినా నాని వెనుకాడడు.ఈ దశలో సుహాసినిని రంగంలోకి దించితే నాని ఆమెకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగేందుకు వెనుకడుగు వేస్తాడని టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube