వై యస్ గారి బయోపిక్ లో సబితా ఇంద్రా రెడ్డి గా నటించబోతున్న నటి ఎవరో తెలుసా?       2018-06-15   04:15:27  IST  Raghu V

బయోపిక్ తీయడం లో ముందుంటారు బాలీవుడ్ దర్శకులు , అక్కడ బయోపిక్ లకి మంచి ఆదరణ ఉంటుంది.రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఎం ఎస్ ధోని బయోపిక్ కి 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పోతే మన టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విని సావిత్రి గారి బయోపిక్ తీసి అటు ప్రశంసలు సినిమా కలెక్షన్లు కూడా సాధించాయి.

తెలుగు తారలపై వచ్చిన మొదటి బయోపిక్ అంత గొప్ప హిట్ అయినందుకు ఇప్పుడు మరిన్ని బయోపిక్ లు తీయడానికి దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతుంది. తన తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహి వి.రాఘవ ‘యాత్ర’ తెరకెక్కిస్తున్నారు. రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు గనుక, ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆయన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది.ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం ‘ఆశ్రిత వేముగంటి’ని ఎంపిక చేసుకున్నారు.

ఇక ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే సుహాసిని అంగీకరించిందని అంటున్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకునన్నట్లు వార్తలు వచ్చాయి.