వెండితెరపై మెరిసేందుకు సిద్దమౌతున్న సుహానా ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లో ఒక మెరుపు మెరిసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.ఇప్పటికే కొన్నీ మ్యాగజైన్స్ కు ఫోజులు ఇచ్చిన ఫోటో షూట్ లు నిర్వహించిన సుహానా తాజాగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజీ కి ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

 Suhana Khan Is Getting Ready To Acting-TeluguStop.com

అయితే ఆ ఫోటోలలో సుహానా ను చూశారంటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.

ఒక మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ ఎలాంటి హావభావాలు చూపిస్తుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా సుహానా ఫోజులు ఇవ్వడం గమనార్హం.

తల్లి గౌరీ ఖాన్,తండ్రి షారూఖ్ ఖాన్ ల సమక్షంలోనే ఈ ఫోటు షూట్ జరిగినట్లు సమాచారం.గత కొంతకాలంగా సుహానా సినిమాలలో కనిపించేందుకు సిద్ధమైంది అని, త్వరలోనే ఆమె సినిమా ఇండస్ట్రీ కి వచ్చేస్తుంది అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై అటు షారూఖ్ కానీ,సుహానా కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పటికే అనిల్ కపూర్ కుమార్తె,అలానే పలువురు స్టార్ హీరో ల కూతుర్లు బాలీవుడ్ లో అడుగుపెట్టి విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు బాద్ షా కుమార్తె వంతు రావడం తో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.ఎప్పుడు సుహానా తెరపైన కనిపిస్తుందా అని షారూఖ్ అభిమానులు వేయి కళ్ళ తో ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube