రేయింబవళ్లు అదేప‌నిగా నిద్రపోతున్నారా...? అయితే మ‌ధుమేహం‌ బారిన ప‌డ‌డం ఖాయం... జాగ్రత్త సుమా...!

ప్రస్తుత మానవ జీవితంలో బిజీ లైఫ్ కి అలవాటు పడిన మనుషులు పనిలో పడి చివరకు నిద్రపోవడం చాలామంది తగ్గించేశారు.పని ఒత్తిడి కారణంగా లేదా ఏదైనా మానసిక సమస్యల కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.

 Sugar, Sleeping, Morning, Night, Work-TeluguStop.com

అయితే మరి కొందరు రాత్రి పని చేసుకుంటూ ఉదయం పూట నిద్రపోతున్నారు.అయితే ఉదయం పూట అతిగా నిద్రపోతే మధుమేహం బారిన కచ్చితంగా పడతారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అవును మీరు విన్నది నిజమే… ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని ఖచ్చితంగా అని తేల్చి చెప్పారు.ఆ విషయంలో కేవలం మధుమేహం బారిన మాత్రమే కాకుండా, అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఉదయం పూట అధికంగా నిద్రించే వారిలో మధుమేహం బారిన పడటమే కాకుండా అధిక బరువు పెరగడానికి కూడా దారితీస్తుందని నిపుణులు నిర్ధారణ చేశారు.వీటితో పాటు గుండె నొప్పి క్యాన్సర్ లాంటి దీర్ఘ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి రాత్రిపూట మానవాళికి అవసరమయ్యే నిద్ర ను నిద్రపోయి, ఉదయం పూట అసలు నిద్ర పోకుండా ఉండే విధంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.

రాత్రిపూట ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా పడుకునే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని బల్లగుద్ది చెబుతున్నారు మానసిక వైద్యులు.

అయితే నైట్ షిఫ్ట్ ఉండే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వీరికి ఓబిసిటీ వస్తుందని దాని వల్ల పలు మార్పులు శరీరంలో సంభవిస్తాయని తెలుస్తోంది.

అంతే కాదు రాత్రి పడుకునే సమయంలో వారికి దగ్గరలో కంప్యూటర్లు సెల్ ఫోన్ లు వీలైనంత దూరంగా పెట్టుకోవాలని తెలుపుతున్నారు.కాబట్టి ప్రతి ఒక్క మనిషి కచ్చితంగా 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలని ఒకవేళ అటూ ఇటూ అయినా సరే మరుసటి రోజు దాన్ని చేసుకోవాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.

వీటితో పాటు రాత్రి పడుకునే ముందు తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరంలో జీర్ణ వ్యవస్థ సరిగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.తేలిక ఆహారం తీసుకోవడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని తెలుపుతున్నారు.

కాబట్టి వీలైనంత వరకు రాత్రి పూట పడుకొని ఉదయం పూట పడుకోకుండా ఉండేలా చూసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube