జబర్దస్త్ నుండి వెళ్లిపోతున్న సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన ప్రోమో!

Sudugali Sudheer Is Leaving Jabardast Promo Has Gone Viral

బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకొని విజయపథంలో దూసుకుపోతున్న కార్యక్రమాల్లో జబర్దస్త్ కార్యక్రమం మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు.ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినా జబర్దస్త్ కార్యక్రమంతో మాత్రం పోటీ పడలేక పోయాయి.

 Sudugali Sudheer Is Leaving Jabardast Promo Has Gone Viral-TeluguStop.com

ఇందులో పాటిస్పేట్ చేసిన ఎంతో మంది కమెడియన్స్ వారి అద్భుతమైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం అద్భుతమైన రేటింగ్స్ సంపాదించుకొని జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా వారంలో రెండు రోజులు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారికి ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పవచ్చు.ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.

 Sudugali Sudheer Is Leaving Jabardast Promo Has Gone Viral-జబర్దస్త్ నుండి వెళ్లిపోతున్న సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన ప్రోమో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.అలాగే వెండితెరపై కూడా ఇతనికి ఎన్నో అవకాశాలు రావడంతో అన్నింటిని మేనేజ్ చేయలేక ఎంతో సతమతమవుతున్నారు అని ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి కొన్ని రోజులు విరామం ప్రకటించాలని భావించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ప్రతి ఏడాది మల్లెమాల జబర్దస్త్ కమెడియన్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు.ఈ క్రమంలోనే ఈసారి వీరితో అగ్రిమెంట్ చేయించుకుంటున్న సమయంలో సుడిగాలి సుధీర్ అండ్ టీం అగ్రిమెంట్ పై సంతకాలు చేయకుండా వారు ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.ఇకపోతే ఈ వారం ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ ఎప్పటిలాగే అద్భుతమైన స్కిట్ లతో ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి గెటప్ శ్రీను వేదికపైకి వచ్చి.జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి తాము వెళ్ళిపోతున్న విషయాన్ని తెలియజేశారు.మేము జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లి పోతున్నామని ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని భావించాము.కానీ ఇలా వేదికపై చెప్పాల్సి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు అని ఎమోషనల్ అయ్యాడు.

ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని.ఇకపై జబర్దస్త్ వేదికపై తమ సందడి ఉండదంటూ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ముగ్గురు ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

అనంతరం వీరు ముగ్గురు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా వీరు జబర్దస్త్ కి గుడ్ బై చెబుతున్నారు అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి జడ్జీలు సైతం షాక్ కి గురయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే నిజంగానే సుడిగాలి సుధీర్ అండ్ టీం జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్తున్నారా లేకపోతే ప్రోమో కోసం ఇలా ఈ సన్నివేశాన్ని హైలెట్ చేశారా అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

#Promo #Jabardast #ExtraJabardasth #Auto Ram Prasad #Getup Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube