ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే?

బుల్లితెర స్టార్ కమెడియన్ అయిన సుడిగాలి సుధీర్ వయస్సు ప్రస్తుతం 34 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపై పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Sudigali Sudheer Wedding Almost Fixed And Here Details About Women, Sudigali , W-TeluguStop.com

గడిచిన ఏడు సంవత్సరాలుగా తన కామెడీ డైలాగ్స్ తో సుడిగాలి సుధీర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.సుడిగాలి సుధీర్ పాల్గొన్న ఈవెంట్ లకు సైతం మంచి రేటింగ్స్ వస్తుండటం గమనార్హం.

గతంలో సుడిగాలి సుధీర్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమలో ఉన్నాడని ఆ కారణం వల్లే పెళ్లిని వాయిదా వేస్తున్నాడని ప్రచారం జరిగింది.

అయితే కొందరు జబర్దస్త్ కమెడియన్లు మాత్రం రష్మీకి ఇప్పటికే పెళ్లైందని చెబుతున్నారు.అయితే గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ మాత్రం సీరియస్ గానే పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.

Telugu Avinash, Jabardasth, Tollywood, Fixed-Movie

వయస్సు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సుడిగాలి సుధీర్ సైతం పెళ్లి విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతితోనే అతని వివాహం జరగనుందని సమాచారం.సుధీర్ కు కూడా సంబంధం నచ్చి వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.అయితే ఈ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో సుధీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Avinash, Jabardasth, Tollywood, Fixed-Movie

కొన్ని నెలల క్రితం ప్రముఖ కమెడియన్ అవినాష్ పెళ్లి జరగగా సుధీర్ పెళ్లి కూడా త్వరగా జరిగితే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు.వివాదాలకు దూరంగా ఉండే సుధీర్ కమెడియన్ గా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.సుధీర్ తమ్ముడు ఇప్పటికే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు రియాలిటీ షోలలో చేస్తూనే మరోవైపు సుధీర్ సినిమాలలో కూడా నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube