సినిమా హీరోగా పరిచయం అవ్వబోతున్న సుడిగాలి సుధీర్.. ఈ సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా...  

Sudigali Sudheer To Act As Hero-

జబర్దస్త్ కామెడీ షో ఈ టీవీ లో ప్రసారం అయ్యే ఈ కామెడీ షో జనాలని బాగా అలరిస్తుంది.ఈ కామెడీ షో ద్వారా చాలా మంది ఆర్టిస్ట్ లు పరిచయమయ్యారు.

Sudigali Sudheer To Act As Hero-

అందులో కొంతమంది కనుమరుగైతే మరి కొంత మంది మంచి స్టార్ డాం ని సంపాదించుకున్నారు.అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు.అయితే బుల్లి తెర పైన తన కామెడీ తో , యాంకరింగ్ తో , మేజిక్ లతో అలరించిన సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన హీరో గా పరిచయం అవబోతున్నాడు.

ఇప్పటి వరకు జబర్దస్త్ తో పాపులర్ అయిన చమ్మక్ చంద్ర , ధనరాజ్ , చలికి చంటి లాంటి వాళ్ళు బుల్లి తెర పైన అలరించి సినిమా ల్లో నటించిన వాళ్లే .ధనరాజ్ , చమ్మక్ చంద్ర లు సినిమాల్లో ఏకంగా హీరోలు గా కూడా నటించారు.ఇప్పుడు వారిలాగే సుడిగాలి సుధీర్ కూడా ఒక ఫుల్ లెంగ్త్ సినిమాలో హీరో గా నటించబోతున్నాడు.

Sudigali Sudheer To Act As Hero-

ఇప్పటి వరకు సుధీర్ కొన్ని సినిమాల్లో సహా నటుడిగా కమెడియన్ గా నటించాడు.అందులో ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ , నేను శైలజ వంటి పెద్ద సినిమాల్లో నటించారు.

ఇకపోతే జబర్దస్త్ షో లో మిగితా ఆర్టిస్ట్ లతో పోలిస్తే సుధీర్ కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.అతడు చేసే కామెడీ , యాంకరింగ్ , మ్యాజిక్ లతో పాటు తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇంతవరకు రావడం ప్రేక్షకుల్లో అతని పైన అభిమానాన్ని మరింత పెంచాయి.

ఇప్పుడు సుధీర్ నటించబోయే సినిమాని టాలీవుడ్ లో కామెడీ సినిమాలు దర్శకత్వం చేసే ప్రముఖ డైరెక్టర్ దరకత్వం వహించనున్నడట.దానికి సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.దీనికి సుధీర్ కూడా అంగీకరించడం తో త్వరలో ఈ సినిమాకి సంబంధించి వివరాలను ప్రేక్షకులతో పంచుకొనున్నారు.ఈ సినిమాను భారీ గానే తీయాలని ప్రయత్నిస్తునడట దర్శకుడు.

ఇదిలా ఉంటే గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది.అయితే అది విడుద‌ల కాలేదు.క‌నీసం అలాంటి ఓ సినిమా చేసిన‌ట్లు కూడా తెలియ‌దు.ఇక ఇప్పుడు మాత్రం హీరోగా కాస్త పేరున్న ద‌ర్శ‌కుడు.

టీంతో సినిమా చేయాల‌ని చూస్తున్నాడు సుధీర్.మ‌రి ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ టీవీల్లో మాదిరే సినిమాల్లో కూడా అలరిస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు

Sudigali Sudheer To Act As Hero- Related....