ఢీ 10 షో కు సుడిగాలి సుధీర్ గుడ్ బై ? కారణం ఏంటో తెలిస్తే షాక్       2018-06-07   05:47:19  IST  Raghu V

సుడిగాలి సుధీర్ గురించి అందరికి తెలిసిందే , జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో లో టీం లీడర్ గా వ్యవహరిస్తూ మంచి కామెడీ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. సుదీర్ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ‘జబర్దస్త్’ షో కాకుండా ఢీ 10 షో , పొర పోవే మరియు మరికొన్ని షో లు కూడా చేస్తున్నాడు.

బుల్లితెర షో లు చేస్తూ బిజీగా ఉన్న సుదీర్ కి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటివరకు అడపా దడపా సినిమాలు చేసిన సుదీర్ కి ఇప్పుడు మంచి అవకాశాలు తలుపు తట్టాయట.
దాంతో సినిమాల వైపుకు వెళ్ళటానికి కొన్ని షో లను తగ్గించుకుందామని ప్లాన్ చేస్తున్నాడట.అప్పట్లో సర్దార్ గబ్బర్ సింగ్ , నేను శైలజ వంటి సినిమాల్లో చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

అయితే సినిమాల కోసం డేట్స్ సర్దుబాటు చేయలేక కొన్ని షో లను వదులుకోవడం చాలా బాధగా ఉందని సుదీర్ తన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తుంది. 2018 లో చాలా సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ రావటంతో డేట్స్ అన్ని ఆ సినిమాలకు ఇచ్చేశాడట. దాంతో ఏ షో నుండి బయటకు వెళ్ళదామా అని ఆలోచించినప్పుడు ఎక్కువ డేట్స్ కేటాయించిన ఢీ షో నుంచి బయటకు వెళ్ళటం బెటర్ అని అనుకున్నాడని సమాచారం.

ఢీ యాజమాన్యానికి చెప్పితే అర్ధం చేసుకొని ఒప్పుకుంటారని సుదీర్ భావిస్తున్నాడు. పంచ్ డైలాగ్స్,ఎనర్జిటిక్ తో ఉండే సుదీర్ లేని ఢీ కార్యక్రమం చూడటం కాస్త కష్టమే మరి. ఢీ టి ఆర్ పి రేటింగ్స్ పెరగటంతో సుదీర్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు… ఢీ షో లో సుధీర్ తో రష్మీ చేసే అల్లరి పనులు మరియు వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు చాలా నచ్చింది.మరి ఢీ షో లో సుధీర్ కొనసాగుతాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..