స్టార్ మా లో.. సుధీర్ అన్నీ లక్షల పారితోషికాన్ని తీసుకుంటున్నాడా?

సుడిగాలి సుదీర్.ఈ పేరు కనిపించింది అంటే చాలు ఆ వార్త వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది.

 Sudigali Sudheer Remuneration In Star Maa Super Singer Junior Details, Sudigali-TeluguStop.com

అవును మరి జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుధీర్.ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీం లీడర్ గా మారి.

జబర్దస్త్ కే ఓకే ఒకడిగా టాప్ టీం లీడర్ గా ఎదిగాడు.పంచులు వేయడం కాదు తీసుకోవడంలోనూ మజా ఉంది అని నిరూపించి ఎంతోమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

కానీ ఏమైందో జబర్దస్త్ నుండి తప్పుకుని.ఇక ఇప్పుడు మరో ఛానల్లో ప్రత్యక్షమయ్యాడు సుడిగాలి సుదీర్.

సుధీర్ ఎందుకు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు అన్న చర్చ గత కొంత కాలం నుంచి జరుగుతూనే ఉంది.

జబర్దస్త్ కు ఎంతో సేవ చేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ విషయంలో జబర్దస్త్ నిర్వాహకులతో డీల్ కుదరక బయటికి వచ్చేశాడు అన్న టాక్ కూడా వినిపించింది.

ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో సూపర్ సింగర్ జూనియర్ ప్రోగ్రాం కి అనసూయ తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.కాగా ఈ షో లో సుధీర్ పారితోషికం ఎంత అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

గతంలో యాంకర్ అనసూయ కంటే సుధీర్ టీం లీడర్ గా పారితోషికం తక్కువగానే తీసుకున్నాడు.ఇక ఈ విషయం లోనే జబర్దస్త్ నిర్వాహకులతో సుధీర్ కి మధ్య చిన్న వివాదం తలెత్తిందట.

Telugu Anchor Anasuya, Stars, Jabardasth Show, Maa Channle, Maa, Sudheer, Sudiga

ఇక ఇప్పుడు స్టార్ మా ఛానల్ లో మాత్రం సుధీర్ కి పారితోషికం బాగానే ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే మరికొన్ని ఛానల్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు సుడిగాలి సుదీర్.త్వరలో కామెడీ స్టార్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే స్టార్ మా లో యాంకర్ గా ప్రత్యక్షమవ్వగా ఇక ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నాడట సుడిగాలి సుదీర్.

ఇది జబర్దస్త్ లో ఇచ్చే దానికంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది.ఇక ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube