ఒక్క ఫోన్ కాల్ తో ఆ యాంకర్ ని బెదరగొట్టిన సుడిగాలి సుధీర్!  

Sudigali sudheer, dhee show, etv television show, prank call, vishnu priya, - Telugu Dhee Show, Etv Television Show, Prank Call, Sudigali Sudheer, Vishnu Priya

సుడిగాలి సుదీర్ కమెడియన్ లలో టాప్ మోస్ట్ కమెడియన్ గా పేరును సంపాదించుకున్నారు.సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమాత్రం లేదు.

TeluguStop.com - Sudigali Sudheer Prank Call To Vishnu Priya In Dhee Show

జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తూ తను వేసే పంచ్ ల ద్వారా ఎంతోమందీ అభిమానులను సొంతం చేసుకున్నాడు.అయితే కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా, పోవే పోరా షో కు విష్ణుప్రియ తో కలిసి యాంకర్ గా కొనసాగుతున్నారు.

అంతేకాకుండా “ఢీ” షో లో టీమ్ లీడర్ గా ఎంతో పాపులారిటీ ని సంపాదించుకున్నాడు.అలా సంపాదించిన పాపులారిటీతోనే సాఫ్ట్ వెర్ సుధీర్, త్రి మంకీస్ లో ఏకంగా హీరోగా నటించాడు.

TeluguStop.com - ఒక్క ఫోన్ కాల్ తో ఆ యాంకర్ ని బెదరగొట్టిన సుడిగాలి సుధీర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రతి బుధవారం ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తూ రష్మి, సుదీర్ పలు టాస్క్ లు చేస్తూ ఉంటారు.ఇక అలానే ఈ టాస్క్ లో భాగంగా యాంకర్ ప్రదీప్ సుధీర్ ని ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయమని టాస్క్ ఇస్తారు.

అయితే సుధీర్ యాంకర్ అయిన విష్ణు ప్రియకి ఫోన్ చేసి తను పోవే పోరా, జబర్దస్త్ వంటి షోలలో పాటిస్పేట్ చేయనని దారుణంగా అవమానించారని ఫోన్ కాల్ ద్వారా నమ్మించడమే కాకుండా ఆమెను కుడా పోవే పోరా షో నుంచి బయటకు రావాలని అడిగి బెదర గొట్టాడు.అయితే ఇదంతా కేవలం టాస్క్ లో భాగమని తర్వాత ప్రదీప్ తెలియజేశారు.

సుడిగాలి సుధీర్ తన నటన ద్వారా స్టార్ కమెడియన్ గా బుల్లితెరపై పేరు సంపాదించడమే కాకుండా, తన నటనతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.గత సంవత్సరం “సాఫ్ట్ వేర్ సుధీర్” అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అయితే ప్రస్తుతం ఎటువంటి చిత్రాలలో నటించకపోయినప్పటికీ, పోవే పోరా, జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్ లలో యాంకర్ గా, కమెడియన్ గా చేస్తున్న సుడిగాలి సుధీర్ కి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

#Prank Call #EtvTelevision #Vishnu Priya #Dhee Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు