తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్… వధువు ఎవరంటే…  

Sudigali Sudheer Marriage Viral In Social Media - Telugu Marriage News, Social Media, Sudigali Sudheer, Tollywood

టాలీవుడ్ బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా మరియు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారుండరు.అయితే ఇతడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో ఎక్కువగా పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేస్తున్న కారణంగా సుడిగాలి సుదీర్ ని టాలీవుడ్ సినీ పరిశ్రమలో అందరూ బుల్లితెర పవర్ స్టార్ అని పిలుస్తుంటారు.

 Sudigali Sudheer Marriage Viral In Social Media

అయితే తాజాగా సుడిగాలి సుధీర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు  లాక్ డౌన్ విధించడంతో సుడిగాలి సుధీర్ షూటింగ్ లేక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.

తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్… వధువు ఎవరంటే…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో సుడిగాలి సుదీర్ కుటుంబ సభ్యులు సుదీర్ కి పెళ్లి చేయాలనే  ఆలోచనలో పడ్డారట.అంతేగాక ఇప్పటికే సుడిగాలి సుధీర్ కి తగినటువంటి వధువును కూడా చూసినట్లు సమాచారం.అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలువురు టాలీవుడ్ సినీ పరిశ్రమలో బలంగా చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న టువంటి సుడిగాలి సుదీర్ అభిమానులు మాత్రం సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సుడిగాలి సుదీర్ పలుమార్లు తాను టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.అయితే రష్మి గౌతమ్ మాత్రం ఈ విషయంపై గతంలో స్పందిస్తూ తాను సుడిగాలి సుదీర్ కేవలం స్నేహితులం మాత్రమేనని అంతే తప్ప తమ మధ్య ఎటువంటి ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవని స్పష్టం చేసింది.

అయితే సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై మాత్రం సుధీర్ కుటుంబ సభ్యులు స్పందించడం లేదు.దీంతో ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాప్ట్ వేర్ సుధీర్ అనే చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే తాజాగా సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి గౌతమ్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు