రష్మీ ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా.. సుడిగాలి సుధీర్ కామెంట్స్ వైరల్..?

బుల్లితెర జోడీగా పేరు తెచ్చుకున్న రష్మీ సుధీర్ కలిసి చేసే స్కిట్లు కానీ ఒకరిపై మరొకరు చేసుకునే కామెంట్లు కానీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిన్న ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో రష్మీ, సుడిగాలి సుధీర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

 Sudigali Sudheer Interesting Comments About Rashmi Gautam, Jabardasth Show, Ma-TeluguStop.com

ఢీ షో డ్యాన్సర్ పండు పంతులు గెటప్ వేయగా సుధీర్, ఆది పెళ్లికొడుకు గెటప్స్ లో దర్శనమిచ్చారు.

పెళ్లి మాట వినగానే మాటలు కరువయ్యాయని సుధీర్ చెప్పగా నీకే అనుకున్నా నీ మాటలకు కూడా కరువేనా అని రోజా కామెంట్ చేస్తారు.

పెళ్లి వల్ల లాభమేంటని కమెడియన్ సుధీర్ ను అడగగా పెళ్లి వల్ల శోభనం చేసుకోవచ్చని సుధీర్ చెబుతాడు.దీపిక నాకోసం పల్లకి పెట్టడం ఎలా ఉందని అడగగా పుల్లకు పల్లకి పెట్టినట్టు ఉందని ఆది చెబుతాడు.

ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివని రష్మీ సుధీర్ ను అడగగా ప్రేమ కోసం వందసార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తా అని సుధీర్ చెబుతాడు.

ఆదిగారు నన్ను ఇలా పిలిచి కిందపరుస్తారా అని రష్మీ చెప్పగా అది కించపరిచానమ్మా అని ఆది నవ్విస్తాడు.జోడీ అంటే రష్మీ సుధీర్ లా ఉండాలని దీపిక చెప్పగా నువ్వు బీడీలా ఉంటే జోడీ ఇలానే ఉంటుందని ఆది అంటాడు.సుకుమార్ కాల్ చేసి నాకు మూవీలో రోల్ ఇచ్చారని దీపిక చెప్పగా మరి ఏ పచ్చడి నూరుతున్నావని ఆది పంచ్ వేస్తాడు.

రింగ్ నీకు దొరికితే నాకు ఇచ్చావేంటి అని దీపిక ఆదిని అడగగా నువ్వు ఇంటికి వెళ్లాక ఒక్క రింగ్ అయినా ఇస్తావని అంటూ ఆది పంచ్ వేస్తాడు.

ఆ తరువాత రష్మీకి సుధీర్ అరుంధతి నక్షత్రం చూపిస్తాడు.శోభనమేంటే కొంచెం సిగ్గేస్తుందిరా అని సుధీర్ ఆదికి చెప్పగా ఆది నీకా అంటూ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు.రష్మీ నువ్వు నా గుండెలపై వాలిపో నీకు డిస్టర్బెన్స్ అయితే చెప్పు గుండె చప్పుడు కూడా ఆపేస్తానని సుధీర్ అంటాడు.

ఆది ఆ మాట గుండె పగులుద్ది అని పంచ్ వేస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube