బుల్లితెర జోడీలలో రష్మీ( Rashmi ) సుధీర్( Sudheer ) జోడీ క్యూట్ జోడీగా పేరు సంపాదించుకోగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుధీర్, రష్మీ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు.
బుల్లితెరపై సుధీర్, రష్మి జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయితే సుడిగాలి సుధీర్ రష్మీకి భారీ షాక్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అయితే సుడిగాలి సుధీర్ కు తన మరదలితో ఎంగేజ్మెంట్( Sudheer Engagement ) జరిగిందని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నాడని సమాచారం అందుతోంది.వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించడానికి సుడిగాలి సుధీర్ ఇష్టపడటం లేదు.
ఈ వార్త నిజమైతే మాత్రం అభిమానులకు షాకేనని చెప్పాలి.మరోవైపు రష్మీకి కూడా పెళ్లి జరిగిందని గతంలో పలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.

అయితే సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుండేదని ఇప్పటికీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆఫ్ స్క్రీన్ లోనూ, ఆన్ స్క్రీన్ లోనూ ఈ జోడీ బెస్ట్ జోడీ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు సుధీర్ హీరోగా పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోకపోవడం గమనార్హం.

సుధీర్, రష్మీ జంటగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నామని గతంలో ఒక నిర్మాత ప్రకటించగా ఆ ప్రాజెక్ట్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.సుధీర్, రష్మీ జంటగా షోలను ప్లాన్ చేస్తే మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ప్రముఖ టీవీ ఛానెళ్ల నిర్వాహకులు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.
సుధీర్, రష్మీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.