టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కు బుల్లితెరపై మంచి పేరు ఉంది. జబర్దస్త్ షోకు దూరమైన చాలామంది కమెడియన్లు ఆ షో గురించి నెగిటివ్ కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే సుధీర్ మాత్రం ఆ షో గురించి ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లు చేయలేదు.ఆర్థిక సమస్యల వల్ల కొంతకాలం జబర్దస్త్ షోకు దూరమైన సుధీర్ ఆ షోలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు.
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తే ఆయన కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ప్రముఖ సింగర్లలో ఒకరైన భువనేష్ సూపర్ సింగర్ జూనియర్ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
చిన్నతనం నుంచి భువనేష్ కు చూపు లేదనే సంగతి తెలిసిందే.అయితే అతని కంటిచూపుకు సంబంధించిన చికిత్స కోసం సహాయం చేస్తానని సుధీర్ మాట ఇచ్చారని అతని తల్లీదండ్రులు చెబుతున్నారు.
భువనేష్ ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థి కావడం గమనార్హం.ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ చూపు లేకపోవడంతో భువనేష్ నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చూపు లేకపొయినా తన ప్రతిభతో భువనేష్ ఈ స్థాయికి చేరుకున్నారు.ఆపరేషన్ సక్సెస్ అయ్యే వరకు చెప్పొద్దని సుధీర్ చెప్పారని భువనేష్ తల్లీదండ్రులు కామెంట్లు చేశారు.
భువనేష్ తల్లీదండ్రులు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుడిగాలి సుధీర్ తన టాలెంట్ తో ఊహించని స్థాయికి ఎదిగారు.త్వరలో జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తానని సుధీర్ చెబుతుండగా జబర్దస్త్ షో నిర్వాహకుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాల్సి ఉందని తెలుస్తోంది.సుధీర్ రీఎంట్రీ ఉంటుందో లేదో అతి త్వరలో స్పష్టత రానుంది.
సుధీర్ రియల్ స్టార్ హీరో అని అతని అభిమానులలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.