బాబా భాస్కర్ కు చుక్కలు చూపించిన సుధీర్ ఫ్యాన్స్..?

బుల్లితెరపై తక్కువ సమయంలోనే జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, నటుడు సుధీర్.ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ తో పాటు పోవే పోరా, ఢీ ఛాంపియన్స్ షోలతో బిజీగా ఉన్నారు.

 Sudigali Sudheer Fans Serious On Baba Bhaskar Master, Baba Bhaskar Master, Jabar-TeluguStop.com

కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడిన సుధీర్ కష్టపడి ఎదుగుతున్నాడు.ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ చేతిలో హీరోగా మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా సుధీర్ కు అవకాశాలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో సుధీర్ ఫ్యాన్స్ ఒక గ్రూపుగా ఏర్పడి సుధీర్ సినిమాలకు, షోలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

అయితే గత కొంతకాలంగా చాలా షోలలో సుధీర్ ను అవమానించే విధంగా కొందరు సెలబ్రిటీలు పంచులు వేస్తున్నారని సుధీర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సుధీర్ పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉండటంతో ఆవేదన చెందుతున్నారు.

గతంలో ఒక ఈవెంట్ లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సుధీర్ ను ఎవడ్రా నువ్వు.? అని కామెంట్ చేయగా నెటిజన్లు సీరియస్ కావడంతో రాహుల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.గత కొన్ని వారాలుగా ఢీ ఛాంపియన్స్ షోకు శేఖర్ మాస్టర్ బదులుగా బాబా భాస్కర్ మాస్టర్ హాజరవుతున్నారు.అయితే బాబా భాస్కర్ సుధీర్ పై వేసిన పంచులు శృతి మించడంతో సుధీర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

బాబా మాస్టర్ ప్రతి ఎపిసోడ్ లో సుధీర్ ను వేస్ట్, టోటల్ వేస్ట్ అంటూ ఉండటంపై ఫైర్ అవుతున్నారు.సోషల్ మీడియాలో బాబా భాస్కర్ మాస్టర్ ను విపరీతంగా ట్రోల్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.

బాబా భాస్కర్ మాస్టర్ బుధవారం రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ తో పాటు ప్రోమోలో కూడా సుధీర్ ను వేస్ట్ అనడంతో బాబా భాస్కర్ సారీ చెప్పాలని కోరుతున్నారు.మరోవైపు సుడిగాలి సుధీర్ మాత్రం బాబా భాస్కర్ సీనియర్ డ్యాన్స్ మాస్టర్ అని.ఆయన సరదాగానే అన్నారని అభిమానులకు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube