ప్రదీప్ ఆరోగ్యంపై సుడిగాలి సుధీర్ కామెంట్స్.. అంతా బాధ అంటూ?

బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్ లో మందున్న ప్రదీప్ మాచిరాజు గురించి అందరికీ తెలిసిందే.రేడియో జాకీ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్.

 Sudigali-sudheer-emotional-comments-on-anchor-pradeep-in-30-rojullo-preminchadam-TeluguStop.com

తన యాంకరింగ్ తో యువతను బాగా ఆకట్టుకున్నాడు.ఈయన చేసే కొన్ని కార్యక్రమాలలో గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

జీ తెలుగులో కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షో ద్వారా యాంకరింగ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.గడసరి అత్త సొగసరి కోడలు షో లో యాంకరింగ్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

అంతేకాకుండా 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య వంటి స్టార్ హీరోల సినిమాలలో సహాయ పాత్ర లో నటించాడు.ఇటీవలే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా నటించగా సినిమా విడుదలకు సిద్ధం కానుంది.

ఇక ప్రదీప్ ఆరోగ్యం గురించి సుడిగాలి సుదీర్ కొన్ని కామెంట్స్ చేశాడు.

Telugu Jabardasth, Pradeep, Sudi Sudheer-Movie

మున్నా అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న 30 రోజుల ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా తెరకెక్కనున్నాడు‌.ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం పాట ను విడుదల చేయగా ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా ఈనెల 29న విడుదల కానున్న సందర్భంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఇందులో ఎంతమంది గెస్ట్ లు పాల్గొన్నారు.

ఇక జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుపుతూ ప్రదీప్ విషయంలో ఎమోషనల్ అయ్యాడు.ఈ విధంగా సుడిగాలిసుధీర్ మాట్లాడుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్వించే ప్రదీప్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడని తెలిపాడు.

ఈ సినిమా హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.ఈ సినిమా బావుందని పదిమందికి చూపించండి అంటూ తెలిపాడు.ఇక ప్రదీప్ ఆరోగ్య విషయం గురించి తెలుపుతూ తను షోలలో మిమ్మల్ని నవ్వించేందుకు తనకు ఉన్న సమస్యలను వదిలి మీ ముందు ఉంటున్నాడు.తను ఎక్కువ సేపు కూర్చో లేడు.

అతడికి ఆరోగ్య సమస్య ఉంది.అతడి సంతోషం వెనుక ఎంతో బాధగా ఉంది అని భావోద్వేగమయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube