ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను... ఎమోషనల్ అయిన సుడిగాలి సుదీర్?

సుడిగాలి సుదీర్( Sudheer )హీరోగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఒకప్పుడు మిమిక్రీ చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నటువంటి ఈయనకు మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో అవకాశం వచ్చింది.

 Sudigali Sudheer Emotional Comments About His Fans , Sudigali Sudheer, Jabardast-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బుల్లితెర మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నటువంటి సుధీర్ కు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది దీంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

Telugu Sahastra, Jabardasth, Tollywood-Movie

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి సుధీర్ త్వరలోనే కాలింగ్ సహస్ర ( Calling Sahastra ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ సినిమాను షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Telugu Sahastra, Jabardasth, Tollywood-Movie

నాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి దర్శక నిర్మాతలకు ఈయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం గెటప్ శీను వేణు అన్న వద్దకు వెళ్ళమని నాకు సలహా ఇవ్వకపోతే, మల్లెమాల టీం, జబర్దస్త్ లేకపోతే.మీ అభిమానం నాకు దక్కేది కాదని పేర్కొన్న సుధీర్ వాళ్ల వల్లే మీ అభిమానం నాకు దొరికిందని తెలియజేశారు.ఇలా నన్ను ఇంతగా ఆదరిస్తున్నటువంటి మీ రుణం ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోలేనని సుదీర్ ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

గాలోడు సినిమా మీ అభిమానం వల్లే హిట్ అయిందని ఇంతకన్నా మంచి సినిమాలు చేస్తే మరింత ఆదరిస్తారని, నా శ్రేయోభిలాషులు నాకు సలహా ఇవ్వడంతో సరికొత్త సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నాను అంటూ ఈ సందర్భంగా సుదీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube