సుడిగాలి సుధీర్ కు ఆ ఛానల్ బంపర్ ఆఫర్ డీల్.. అందరూ షాక్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎక్స్ ట్రా జబర్దస్త్ ని కేవలం సుధీర్ స్కిట్స్ కోసమే చూసేవాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.

 Sudigali Sudheer Crazy Deal And Gets Huge Remuneration Details,  Jabardasth,sudi-TeluguStop.com

ఇక యూట్యూబ్ లో అయితే సుధీర్ స్కిట్స్ కి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.సుధీర్ స్కిట్స్ లో పంచులు ఏ విధంగా ఉంటాయో మనందరికి తెలిసిందే.

ఇక సుధీర్ కి రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను లు కలిస్తే ఇక పంచుల వర్షం కురిపిస్తారు అని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం జబర్దస్త్ నుంచి పాపులర్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు.

ఇప్పటికే గత కొన్ని వారాలుగా హైపర్ ఆది స్కిట్ లు ప్రసారం కావడం లేదు అన్న విషయం తెలిసిందే.

సుధీర్ కూడా త్వరలోనే జబర్దస్త్ కి దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

సుధీర్ కి ప్రస్తుతం ఏ రేంజ్ లో పాపులరిటీ ఉందో మనందరికి తెలిసిందే.తనకున్న పాపులారిటీ తో సినిమాలో కూడా అవకాశాలు వస్తుండడంతో సుధీర్ కొద్దిపాటి పారితోషికంతో జబర్దస్త్ చేయడం ఎందుకు అని భావిస్తున్నాడట.

అందుకే మంచి రెమ్యునరేషన్ ఆఫర్స్ వస్తుండడంతో జబర్డస్త్ కి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది.ఇటీవల స్టార్ మాలో సూపర్ సింగర్స్ అనే కొత్త షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

ఈ షో కోసం, భవిష్యత్తులో తమ ఛానల్స్ లో రాబోయే షోల కోసం స్టార్ మా సుధీర్ తో కాట్రాక్ట్ కుదుర్చుకుంది అని ప్రచారం జరుగుతోంది.

Telugu Anasuya, Jabardasth, Maa, Singers Show-Movie

ఈ కాట్రాక్ట్ ప్రకారం సుధీర్ కి బంపర్ రెమ్యునరేషన్ దక్కుతోందట.జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల కోసం సుధీర్ కి ఆ ఛానల్ వాళ్ళు ఎపిసోడ్ కి మూడున్నర నుంచి నాలుగు లక్షల పారితోషికం ఇచ్చేవారట.కానీ స్టార్ మాలో సుధీర్ కి ఆరున్నర నుంచి 7 లక్షల వరకు ముడుతోందట.

స్టార్ మా లో అనసూయ కంటే సుధీర్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అని టాక్.అనసూయని సుధీర్ రెమ్యునరేషన్ విషయంలో బీట్ చేశాడంటే అది మాములు విషయం కాదు మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube