Sudigali sudheer jabardasth : మళ్లీ జబర్దస్త్ షోలో అడుగుపెట్టనున్న సుడిగాలి సుధీర్.. వైరల్ న్యూస్!

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్.

 Sudigali Sudheer Comments Over Jabardasth Re Entry Sudigali Sudheer,  Jabardasth-TeluguStop.com

కాగా సుధీర్ కు తెలుగులో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.ప్రస్తుతం సుధీర్ ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా ఇటీవల విడుదలైన ఒక సినిమా కూడా ఉహించని విధంగా డిజాస్టర్ కావడంతో సుధీర్ కు తీవ్ర నష్టాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.కాగా బుల్లి తెర పై జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల తో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

సుధీర్ వెండితెర పై అవకాశాల కోసం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను సైతం వదిలిపెట్టి వెళ్ళాడు అంటూ జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇదే విషయంపై సుధీర్ పై నెగిటివ్ గా కూడా కామెంట్స్ వినిపించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆ వార్తలపై స్పందించాడు సుధీర్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ తాను జబర్దస్త్ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.

ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్ మాట్లాడుతూ.ఆరు నెలల క్రితం నేను కొంత వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాను.

జబర్దస్త్ యాజమాన్యానికి నా పరిస్థితి చెప్పుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాను.

ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి.నేను పడిన కష్టాలు అన్ని వారికి వివరించాను.మళ్లీ జబర్దస్త్ కి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో అందుకు జబర్దస్త్ వాళ్ళు సరే అన్నారు త్వరలోనే నేను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాను అంటూ సుధీర్ తన అభిమానులకి చక్కటి శుభవార్తను చెప్పాడు.

అయితే మొత్తానికి సుధీర్ జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలు చెప్పడంతో పాటు జబర్దస్త్ షోనీ విడిపోవడం పట్ల వచ్చిన వార్తలు అన్నీ కూడా అవాస్తవాలే అని కొట్టి పడేసాడు సుదీర్.కాగా ఈ వార్త విన్న సుధీర్ అభిమానులు సంతోషంతో ఉన్నారు.

జబర్దస్త్ షోలో సుధీర్ ని చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube