సుడిగాలి సుధీర్ ఇంట సంబరాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ స్టేజ్ ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు.

 Sudigali Sudheer Brother Rohan S Wife Blessed With A Baby Boy , Sudigali Sudheer-TeluguStop.com

మెజీషియన్ గా, కమెడియన్ గా, హీరోగా, యాంకర్ గా ఇలా అన్ని రంగాల్లో తనదైన సత్తాను చాటుతూ దూసుకుపోతున్నాడు.ఇకపోతే సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో హీరోగా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇక బుల్లితెర ప్రేక్షకులు అయితే సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అంటూ ఉంటారు.

షోలలో, ఈవెంట్ లలో సుధీర్ పై ఎంత మంది ఎన్ని విధాలుగా పంచులు వేసిన కూడా స్పోటివ్ గా తీసుకుంటాడు.

ఇక హీరోగా మారిన సుధీర్ సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ అనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం కాలింగ్ సహస్ర, గాలోడు, వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలు చేస్తున్నాడు.

అసలు విషయం ఏమిటంటే తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు.సుధీర్ తమ్ముడు రోహన్ గురించి మనందరికీ తెలిసిందే.

రోహన్ కూడా అప్పుడప్పుడు ఈవెంట్ లలో సందడి చేస్తూ ఉంటాడు.

Telugu Baby Boy, Rohan-Movie

తాజా సమాచారం ఏమిటంటే రోహన్ భార్య ఇటీవలే డెలివరీ అయిందని, రోహన్ భార్య పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చిందని అని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో సుధీర్ పెదనాన్న అయ్యాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.సుడిగాలి సుధీర్ ఇంట సంబరాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు.

సుధీర్ తమ్ముడు రోహన్ తండ్రి కావడంతో సుదీర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడట.సుధీర్ ఫామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సుధీర్ తమ్ముడు రోహన్ కి విషెస్ విషెస్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube