సుడిగాలి సుధీర్ బిగ్ మిస్టేక్..!

జబర్దస్త్ ప్రోగ్రాం తో పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు.సుధీర్ టీం లో గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ లతో కలిసి సుధీర్ మంచి స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు.

 Sudigaali Sudheer Big Mistake ,sudigaali Sudheer, Super Singer Juniors, Comedy S-TeluguStop.com

జబర్దస్త్ లో తన క్రేజ్ తో ఈటీవీ డ్యాన్స్ షో ఢీ లో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు.కొన్ని కారణాల వల్ల సుధీర్ ని ఢీ షో నుండి తప్పించారు.

ఈమధ్యనే జబర్దస్త్ ను కూడా సుధీర్ వదిలిపెట్టాడు.కొత్తగా స్టార్ మాలో వస్తున్న సూపర్ సింగర్ జూనియర్ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్.

షోకి ఫీమేల్ హోస్ట్ గా అనసూయ కూడా చేస్తుంది.అయితే అనసూయ అటు జబర్దస్త్ ఇటు స్టార్ మా లో సూపర్ సింగర్ జూనియర్స్ లో కూడ యాంకర్ గా కొనసాగుతుంది.

కానీ సుధీర్ మాత్రం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి స్టార్ మా లో షో చేస్తున్నాడు.సూపర్ సింగర్ జూనియర్ షో స్టార్ట్ అయ్యి రెండు వారాలు అవుతున్నా ఆ షో అంత ఇంప్యాక్ట్ ఏమి క్రియేట్ చేయలేకపోయింది.

ఈ లెక్కన జబర్దస్త్ వదిలి సుధీర్ పెద్ద మిస్టేక్ చేశాడని ఆడియెన్స్ అనుకుంటున్నారు.స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్స్ షోకి రైటర్ గా కామెడీ స్టార్స్ హరి పనిచేస్తున్నాడు.

షోలో అతని ఎఫర్ట్ బాగున్నా ఎందుకో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube