సుధీర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్.. కన్నీళ్లు పెట్టించేసాడు !

తెలుగు బుల్లితెరలో సుడిగాలి సుధీర్ తెలియని వారు ఉండరు.హీరోగా, కామెడియన్ గా, నటన, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిలో ప్రేక్షకుల మన్నను పొంది.

 Sudhir The Best Performance Tears Came  Sudigali Sudheer, Best Performance, Anch-TeluguStop.com

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన పేరును చెప్తే అందరి ముఖంపై చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది.

అయితే నటనలో కొందరు కమెడియన్లు నవ్వడంతో పాటు ఏడిపించడం చేస్తుంటారు.ఈ క్యారెక్టర్ లో లీనమై జీవించేస్తుంటారు.చూసిన ప్రేక్షకుల కంట నీరు కారాల్సిందే.ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ‘సుధీర్ ఏం యాక్టింగ్ చేశాడు.

ది బెస్ట్’ అని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు.సుధీర్ యాక్టింగ్ కి టీవీ షోల రేటింగ్స్ పెరిగిపోతున్నాయి.

అందుకే ఈటీవీ కూడా సుధీర్ క్రేజ్ ను గుర్తించి ప్రత్యేక షోలు ప్లాన్ చేస్తుంటుంది.ఈ మేరకు వినాయకచవితి సందర్భంగా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

‘అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి-2020’ అంటూ ప్రోమోలు కూడా రిలీజ్ చేసింది.ఇప్పటికే ఆ ప్రోమోలు వైరల్ అయి అధిక సంఖ్యలో వ్యూవ్స్ ను సంపాదించుకున్నాయి.

అయితే ఈ ప్రోమోలో సుధీర్ డ్యాన్స్ తో కూడిన ఎమోషనల్ స్కిట్ ను చేశాడు.ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తో ఓ కుటుంబం పడే బాధపై తీసిన ఆ వీడియో సుధీర్ కెరియర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలవనుంది.

కరోనా సమయంలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.ఇంట్లో భార్య గర్భవతి.అంతలోనే డాక్టర్ కి కరోనా.కుటుంబానికి, భార్యకు, పుట్టబోయే పాప కోసం తాపత్రయ పడుతూ చనిపోయో డాక్టర్ పాత్రలో సుధీర్ అందరిని కంటతడి పెట్టించాడు.

ఈ క్యారెక్టర్ లో అంతగా లీనమై నటించాడు.ఈ నటనను చూడటానికి ఇప్పటికే అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube