అబ్బో.. సుడిగాలి సుధీర్ అప్పట్లోనే యాడ్ వీడియోలో నటించాడా?

Sudigali Sudheer Act In The Ad Video At The Time

బుల్లితెరపై అతి తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని బుల్లితెర కింగ్ గా పేరు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే.కమెడియన్ గా, నటుడుగా, యాంకర్ గా, మెజీషియన్ గా ఇలా ప్రతి ఒక్క వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Sudigali Sudheer Act In The Ad Video At The Time-TeluguStop.com

తక్కువ సమయంలోనే ఒక హీరోకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ లు చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో అవకాశాన్ని అందుకున్నాడు.

ఇక ఇందులో మొదట ఒక టీం లో పనిచేసిన తాను ఆ తర్వాత టీం లీడర్ గా నిలిచి పోయాడు.మంచి కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.

 Sudigali Sudheer Act In The Ad Video At The Time-అబ్బో.. సుడిగాలి సుధీర్ అప్పట్లోనే యాడ్ వీడియోలో నటించాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షో ద్వారానే సుధీర్ కెరీర్ మొత్తం మారిపోయింది.అంతేకాకుండా సుడిగాలి అని పేరు కూడా ఈ షో ద్వారానే సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.కొన్ని అతిధి పాత్రలోనే కాకుండా హీరో పాత్రగా కూడా పలు సినిమాలలో నటించాడు.వెండితెరపై కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాడు.ఆ తర్వాత బుల్లి తెర పై కమెడియన్ గానే కాకుండా పలు షోలలో యాంకర్ గా, టీమ్ లీడర్ గా చేస్తున్నాడు.

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో టీమ్ లీడర్ గా చేస్తున్నాడు.అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో యాంకర్ గా చేస్తూ ఈ షో ద్వారా బెస్ట్ యాంకర్ గా నిలిచాడు.

అంతేకాకుండా ఈ షో కూడా బెస్ట్ షో గా నిలిచింది.ఆ మధ్య బుల్లితెర యాంకర్ల, జడ్జీల సర్వేలో కూడా బెస్ట్ యాంకర్ గా నిలిచాడు.

సుధీర్ ఈటీవీ లో షో లలో మంచి పెర్ఫార్మర్ గా నిలిచాడు.నిజానికి సుధీర్ లేనిదే ఈటీవీలో ఏ షో కూడా అంతగా ఆకట్టుకోలేదు.బుల్లితెర ప్రేక్షకులు, సుధీర్ అభిమానులు ఆ షో లో సుధీర్ ఉన్నట్లయితేనే షో చూడటానికి ఇష్టపడుతుంటారు.ఇదిలా ఉంటే సుధీర్ యాడ్ వీడియో లో కూడా నటించాడు.

ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా ఆయన అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే తను పెళ్ళి చేసుకునే అమ్మాయి వారింట్లో పెళ్లి ఏర్పాట్ల గురించి ఇబ్బంది పడటం తో వాళ్ల కోసం ఆన్ లైన్ లో ఒక వెబ్ సైట్ లో అన్ని ఏర్పాట్ల గురించి బుక్ చేసుకోవచ్చు అని ఆ వెబ్ సైట్ గురించి వివరిస్తాడు.

మొత్తానికి ఇందులో కూడా సుధీర్ నటన బాగా అద్భుతంగా ఉంది.అలా ఆల్ రౌండర్ గా సుధీర్ బెస్ట్ నటుడుగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు.ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో బాగా బిజీగా ఉన్నాడు.

#Anchor #Sudheer #Rashmi #SrideviDrama #Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube