సెట్ లోనే అడుక్కుతింటున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. ఏం జరిగిందంటే?

బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు బాగా ప్రసారమవుతున్నాయి.ఇప్పటికే కామెడీ పరంగా పలు షోలు జబర్దస్త్ కు పోటీగా ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.

 Sudigaali Sudheer Hyper Aadi Sridevi Drama Company Latest Promo Etv-TeluguStop.com

అంతేకాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకోవడంతో రేటింగ్ విషయంలో కూడా బాగా దూసుకుపోతుంది.ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు తమ పర్ఫార్మెన్స్ లతో బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు.

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఏకంగా సెట్ లో అడుక్కు తింటున్నారు.

 Sudigaali Sudheer Hyper Aadi Sridevi Drama Company Latest Promo Etv-సెట్ లోనే అడుక్కుతింటున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్స్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిల గురించి అందరికి తెలిసిందే.

ఎన్నో కామెడీ స్కిట్ లు చేసి ప్రేక్షకులను తెగ నవ్వించారు.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలలో కూడా తమ కామెడీ లతో తెగ ఆకట్టుకుంటున్నారు.ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా టీమ్ లీడర్స్ గా పని చేస్తున్నారు.

అంతే కాకుండా ఈటీవీ లో ప్రసారమౌతున్న మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పాల్గొని బాగా రచ్చ చేస్తున్నారు.ఇందులో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు.ఇక హైపర్ ఆది మాత్రం తన పంచ్ లతో బాగా సందడి చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

ప్రోమో మొదట నుండి చివరి వరకు తెగ సందడిగా సాగింది.

హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తమ కామెడీ లతో బాగా నవ్వించారు.కొందరు డాన్స్ లతో, పాటలతో బాగా ఆకట్టుకున్నారు.ఇక ట్రైన్ జర్నీ లో క్లాస్, మాస్ అంటూ డైలాగ్స్ తో నవ్వించారు.

ఇక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ అడుక్కునే స్కిట్ చేయగా.ఇందులో ఆది డైలాగ్ కే రాంప్రసాద్ పంచ్ డైలాగ్ వేసి నవ్వించాడు.

అంతలోనే మరో కమెడియన్ వచ్చి మీరు బిచ్చగాళ్ల అని అనడంతో.వెంటనే హైపర్ ఆది మీ ఆపరేషన్ కు కలెక్ట్ చేస్తున్నామంటూ పంచ్ విసిరాడు.

అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకోగా.గెటప్ శ్రీను తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.

#New Promo #Getup Srinu #Hyper Aadi #SridaviDrama #Auto Ramprasad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు