స్టార్ మాలో అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్.. మల్లెమాలకు దూరం అవుతున్నాడా?

బుల్లితెర స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం బుల్లితెరలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సుధీర్.

 Sudhir Entered Star Maa Is It Getting Away From Mallemall-TeluguStop.com

పలు షో లతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నాడు.

అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.

 Sudhir Entered Star Maa Is It Getting Away From Mallemall-స్టార్ మాలో అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్.. మల్లెమాలకు దూరం అవుతున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మొదటిసారి స్టార్ మాలో అడుగు పెట్టాడు.

ఈటీవీ లో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

తన కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను నవ్వించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.అంతేకాకుండా ఈటీవీ ప్లస్ లో పోవే పోరా షోలో యాంకరింగ్ చేస్తూ యువతను బాగా ఆకట్టుకున్నాడు.

ఇక ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా చేస్తూ తన పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంటాడు.ఇక మరో యాంకర్ రష్మీ తో ఉండే విధానం చూస్తే నిజంగా ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తాడు.

ఇదంతా పక్కన పెడితే ఈటీవీ లోనే మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకరింగ్ గా చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటాడు.పలు షోలలో జడ్జిల నుండి ఫన్నీ ట్రోల్స్ లను బాగా ఎదుర్కొంటాడు.ఇక ఇప్పటి వరకు ఈటీవీ లోనే పలు షోలు చేసుకుంటూ మల్లెమాల ను విడిచిపెట్టని సుధీర్ తాజాగా మొదటిసారి స్టార్ మా లో అడుగుపెట్టాడు.అసలు సంగతి ఏమిటంటే.

స్టార్ మా లో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ షో గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఈ షోలో ఓంకార్ హోస్టింగ్ చేస్తూ అందులో పాల్గొన్న గెస్ట్ లను గేమ్ లో భాగంగా తెగ టెన్షన్ పెడుతుంటాడు.ఇక తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.అందులో ఓ ఎపిసోడ్ కు బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొనగా.

మరో ఎపిసోడ్ కు సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇందులో వీరిద్దరు తమ డాన్స్ స్టెప్ లతో కనువిందు చేశారు.

దీంతో ఈ ప్రోమోలో ఎక్కువగా సుడిగాలి సుధీర్ గురించి.తన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

సుధీర్ ఇస్ బ్యాక్ అంటూ.ఫస్ట్ టైం ఆన్ స్టార్ మా ఎంట్రీ అంటూ తెగ కామెంట్స్ రావడంతో.

ఇక స్టార్ మాకు త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నాడా.మల్లెమాలకు దూరమవుతాడా.

అని ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి.

#Jabardasth #SudheerSixth #SrideviDrama #Mallemala #Sudheer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు