సుధీర్, రష్మీ జంట గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఈ జంట బుల్లితెరపై తమ పర్ఫార్మెన్స్ తో బాగా సందడి చేస్తుంటారు.
అంతేకాకుండా ఈ జంట గురించి బయట కూడా ఎన్నో మాట్లాడేసుకుంటారు.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో నుండి పరిచయమైన ఈ జంట రష్మీ యాంకర్ గా, సుధీర్ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా వీళ్లు వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నారు.
నిజానికి జబర్దస్త్ లో కమెడియన్స్ పర్ఫామెన్స్ ఒక ఎత్తయితే రష్మీ, సుధీర్ జంట మరొక ఎత్తు.
షో లో ఉన్నంతసేపు వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందా అన్నట్లు అనిపిస్తుంది.ఇతర ఆర్టిస్టులు కూడా వీరి మధ్య ఏదో నడుస్తున్నట్లుగా గానే ఉన్నట్లు ఈ జంటతో అలాగే ప్రవర్తిస్తారు.
ఇక మరో డాన్స్ షో లో కూడా ఈ జంట గురించి బాగా హైలెట్ అవుతూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా వీళ్లు లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నారట.

ఇంతకీ వాళ్లు వెళ్ళేది ఎక్కడో తెలియదు కానీ మొత్తానికి లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు.ఇది నిజం కాదండోయ్ తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వదలగా అందులో ఈ జంట లాంగ్ డ్రైవ్ లో తెగ సందడి చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా ఇందులో రష్మీ.తను లాంగ్ డ్రైవింగ్ కు వెళ్తున్నానని స్టేటస్ పెట్టగా అది చూసి సుధీర్ కూడా తనతో వెళ్లడానికి ప్లాన్ చేస్తాడు.

ఇక తనతో గడపాలనుకునే సుధీర్ కి ఇందులో మధ్య మధ్యలో లిఫ్ట్ కోసం కొందరు తమతో జర్నీ చేస్తూ బాగా సందడి చేస్తుంటారు.ఇక ఈ ప్రోమో లో వీరిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ గా చూపించగా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.