విషం తాగి చనిపోయిన సుధీర్ వర్మ... డెత్ రిపోర్ట్ లో బయటపడ్డ నిజాలు!

Sudheer Verma Died After Drinking Poison The Truth Revealed In The Death Report , Sudheer Verma, Drinking Poison, Death Report , Second Hand, Kundanapu Bomma

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీస్తోంది.సుధీర్ వర్మ నిన్న మధ్యాహ్నం వైజాగ్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.

 Sudheer Verma Died After Drinking Poison The Truth Revealed In The Death Report-TeluguStop.com

ఇలా ఈయన మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ వంటి పలు సినిమాలలో నటించిన సుధీర్ వర్మ మరణించడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

ఇక ఈ విషయం తెలిసినటువంటి పలువురు సెలబ్రిటీలు ఈయన మరణ వార్త పై స్పందిస్తూ నివాళులు అర్పించారు.

Telugu Poison, Kundanapu Bomma, Hand, Sudhir Verma-Movie

ఈయన మరణ వార్త తెలుసుకున్న అనంతరం సుధీర్ మృతదేహాన్ని నగరంలోని ఎల్జి హాస్పిటల్ కు తరలించారు.అయితే అక్కడ వైద్యులు తనకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం తన డెత్ రిపోర్ట్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే వైద్యులు వెల్లడించిన నివేదిక ప్రకారం సుదీర్ వర్మ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.

ఇలా ఈయన విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Telugu Poison, Kundanapu Bomma, Hand, Sudhir Verma-Movie

ఇక సుధీర్ వర్మ కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలియజేశారు.ఇలా అనారోగ్య సమస్యలను అధిగమించలేక ఆత్మహత్య చేసుకున్నారా లేక మరి ఏదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుధీర్ వర్మ ఇంకా పెళ్లి చేసుకోలేదని తన డెత్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

ఏది ఏమైనా ఇండస్ట్రీ ఇలా ఒక నటుడిని కోల్పోవడంతో చిత్రపరిశ్రమ ఈయన మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube