ఎటు తేలని మల్లెమల వ్యవహారం.. మళ్లీ ఈటీవీలో సుడిగాలి సుధీర్, యాంకర్ అనసూయ!

ఈటీవీ మల్లెమాల నిర్మాణ సంస్థ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈ మల్లెమాల నుండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు, కామెడీ షోలు ప్రసారం అవుతున్నాయి.

 Sudheer Sudheer Anchor Anasuya Again On Etv , Sudheer Sudheer , Anchor Anasuya , Etv Show , Jabaardasath ,mallemala,rashmi , Naga Babu ,rashmi,bale Manchi Roju-TeluguStop.com

ఇందులో వచ్చే షోలు అన్ని కొన్ని కొన్ని సార్లు మితిమీరి ఉండగా మరి కొన్ని ఎమోషనల్ టచ్ బాగా ఫీల్ లోకి తీసుకెళ్తాయి.ఈటీవీలో ప్రసారమయ్యే షోలకు చాలావరకు మల్లెమాల నిర్మాణంలోనే ప్రసారమవుతాయి.

ఇక ఈ మల్లెమాల కొన్ని కొన్ని సార్లు షో ల పేరుతో కొన్ని మితిమీరి ప్రవర్తించడం వల్ల ప్రేక్షకుల నుండి దారుణమైన కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది.ఇదంతా పక్కన పెడితే గత కొంత కాలం నుంచి మల్లెమాల ప్రొడక్షన్ లో వస్తున్న షోల నుండి మంచి క్రేజీ గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు బయటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

 Sudheer Sudheer Anchor Anasuya Again On Etv , Sudheer Sudheer , Anchor Anasuya , Etv Show , Jabaardasath ,Mallemala,rashmi , Naga Babu ,Rashmi,bale Manchi Roju-ఎటు తేలని మల్లెమల వ్యవహారం.. మళ్లీ ఈటీవీలో సుడిగాలి సుధీర్, యాంకర్ అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ లో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు ఈ షోను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.ఇక కమెడియన్స్ గా మంచి గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, యాంకర్ అనసూయ వీళ్లంతా జబర్దస్త్ నుండి బయటికి రావటంతో బాగా అనుమానాలు వచ్చాయి.

పైగా వీళ్ళు జబర్దస్త్ మానేసిన తర్వాత అందరూ నేరుగా స్టార్ మా లో ప్రసారమవుతున్న షో లలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే చాలామంది ప్రేక్షకులు ఒకరి తర్వాత ఒకరు స్టార్ మా లో చేరిపోవటంతో వీరికి మల్లెమాలతో ఏదైనా గొడవలు జరిగాయేమో అని అనుకున్నారు.నిజానికి నాగబాబుకు మల్లెమాలకు మధ్య గతంలో మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే.మరి సుధీర్, రష్మీ వాళ్లకుఏం జరిగింది.

మరి వీళ్ళు ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నలు ఎదురవటంతో వీళ్లకు సినిమాలలో అవకాశాలు రావడంతో వెళ్లిపోయారు అని తెలిసింది.

ఇటీవలే అనసూయ జబర్దస్త్ షోపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

తాను ఈ షో నుండి బయటకు వెళ్ళడానికి కారణం ఏంటో కూడా చెప్పేసింది.తను ఆ షోలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను అని అందుకే ఆ షో నుండి బయటికి వచ్చాను అని అనటంతో అందరూ తనపై తీవ్ర విమర్శలు చేశారు.

మళ్లీ ఏదో ఒక రోజు మల్లెమాల కాళ్లు పట్టుకుంటావు అని కూడా అన్నారు.

ఇదంతా పక్కన పెడితే.మళ్ళీ మల్లెమాలలోకి అడుగు పెట్టారు సుధీర్, అనసూయ.తాజాగా ఈటీవీ 27 సంవత్సరాల సందర్భంగా భలే మంచి రోజు అని ఈవెంట్ నిర్వహించారు.

ఇక దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదల అయింది.ఇక అందులో పలువురు సెలబ్రేట్లతో పాటు సీరియల్ నటినటులు, ఆర్టిస్టులు పాల్గొన్నారు.

అందులో యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్ కనిపించడంతో వీలు మళ్లీ రియంట్రీ ఇచ్చినట్లు అర్థమవుతుంది.దీంతో నెటిజన్లు ఈ మల్లెమాల వ్యవహారం ఏంటి అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube