Varsha Sudheer Rashmi: రష్మితో కాకుండా వర్షతో రొమాన్స్ మొదలుపెట్టిన సుధీర్... షాక్ లో ఇమ్మూ?

బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గత కొన్ని రోజులుగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన విషయం తెలిసిందే.అయితే ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో రీఎంట్రీ ఇచ్చారు.

 Sudheer Started Romance With Varsha Instead Of Rashmi Immu In Shock Details, Sud-TeluguStop.com

ఇప్పటికే ఈ కార్యక్రమాలకు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగాయి.ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ రష్మితో కలిసి చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇవ్వగానే వాడిపోయిన గులాబీతో రష్మికి ప్రపోజ్ చేస్తే రష్మీ తనని చీ కొట్టింది.ఇలా రష్మీ కాదనడంతో సుదీర్ ఏకంగా వర్షతో రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు.

వర్ష ఇమ్మానుయేల్ జంట ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే.అయితే గాలి వారి పెళ్లి పిలుపు అనే కాన్సెప్టులో భాగంగా వర్ష పెళ్లికూతురు గెటప్ లో ఉండగా ఇమ్మానుయేల్ పట్టు పంచ కట్టుకొని పెళ్ళికొడుకు గెటప్ లో సందడి చేశారు.

వర్ష, ఇమ్మాన్యుయెల్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సుధీర్ తన కెమెరాతో షూట్ చేస్తున్నారు.అయితే పెళ్లి కొడుకు స్థానంలో ఉన్నటువంటి ఇమ్మానుయేల్ సరిగా ఫోజులు ఇవ్వకపోవడంతో సుధీర్ వెళ్లి వర్షను తన రెండు చేతులలోకి తీసుకొని రొమాంటిక్ యాంగిల్ లో ఫోజులు ఇచ్చారు.ఇలా సుధీర్ వచ్చి రాగానే వర్షతో రొమాన్స్ చేయడంతో ఇమ్మానియేల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇలా చాలా రోజుల తర్వాత సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వచ్చి రావడంతోనే తన కామెడీతో అందరిని నవ్వించడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube