సుధీర్ కూడా 'స్టార్ మా' కి షిఫ్ట్.. సూపర్ సింగర్ జూనియర్ స్టార్ట్..!

జబర్దస్త్ తో సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఆ జబర్దస్త్ ని వీడి బయటకు వచ్చేశాడా అంటే దాదాపు అవుననే అంటున్నారు.అయితే జబర్దస్త్ ని వదిలి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తున్న సుధీర్ త్వరలోనే అక్కడ కూడా కనిపించడని తెలుస్తుంది.

 Sudheer Shift To Star Maa Super Singer Juniors,sudigali Sudheer, Star Maa, Super Singer Juniors,jabardash,comedy Stars-TeluguStop.com

ఇక ఈ గ్యాప్ లో స్టార్ మా లో లేటెస్ట్ గా మొదలైన సూపర్ సింగర్ జూనియర్స్ షోలో యాంకర్ గా కనిపించాడు.జబర్దస్త్ లో ఉన్న వాళ్లు స్టార్ మా లో కనిపించడం అంటే అది మాములు విషయం కాదు.

ఇప్పటికే చాలామంది జబర్దస్త్ ని వదిలి స్టార్ మా కామెడీ స్టార్స్ కి షిఫ్ట్ అవగా ఇప్పుడు సుధీర్ కూడా ఈటీవీని వదిలేసి స్టార్ మాకి షిఫ్ట్ అయ్యాడని అంటున్నారు.మే 22న ఆదివారం గ్రాండ్ గా మొదలైన సూపర్ సింగర్ జూనియర్ షోకి సుధీర్ తో పాటుగా అనసూయ కూడా మరో యాంకర్ కమ్ మెంటర్ గా చేస్తుంది.

 Sudheer Shift To Star Maa Super Singer Juniors,Sudigali Sudheer, Star Maa, Super Singer Juniors,Jabardash,Comedy Stars-సుధీర్ కూడా స్టార్ మా#8217; కి షిఫ్ట్.. సూపర్ సింగర్ జూనియర్ స్టార్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షోకి జడ్జులుగా చిత్ర, మనో, హేమ చంద్ర వ్యవహరిస్తున్నారు.సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన చిత్ర జడ్జ్ చేస్తున్న మొదటి షో ఇదే అవడం విశేషం.

సుధీర్, అనసూయ యాంకర్స్ గా ఈ సూపర్ సింగర్ జూనియర్ షో స్టార్ మాకి మంచి రేటింగ్స్ తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ షోలో మొత్తం 14 మంది జూనియర్ సింగర్స్ పోటీపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube